మూడు సెకన్ల డంబెల్ వర్కవుట్‌తో సిక్స్ ప్యాక్ బాడీ.. 100% పక్కా..

by Prasanna |   ( Updated:2023-04-25 10:51:17.0  )
మూడు సెకన్ల డంబెల్ వర్కవుట్‌తో సిక్స్ ప్యాక్ బాడీ.. 100% పక్కా..
X

దిశ, ఫీచర్స్: దృఢమైన కండరాల కోసం గంటల తరబడి వర్కవుట్స్, బరువులు ఎత్తడం అనేది టైమ్ తక్కువగా ఉన్న ఫిట్‌నెస్ ఔత్సాహికులకు సవాలుగా ఉంటుంది. అయితే అలాంటివారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీకి చెందిన ఫిజికల్ ఫిట్‌నెస్ నిపుణుల బృందం. బరువులు ఎత్తడం కంటే తగ్గించడంపై దృష్టి పెట్టి, సాధారణ వ్యాయామాలు చేయడం కండర ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుందన్నారు. వెయిట్ ట్రైనింగ్‌పై అనేక పరిశోధనలు చేసిన బృందం.. షార్ట్ అండ్ షార్ప్ వర్కవుట్స్ కండరాల పెరుగుదలకు తోడ్పడతాయని కనుగొన్నారు.

ప్రతి రోజూ మూడు సెకన్ల డంబెల్ వర్కవుట్స్ శక్తిలో గణనీయమైన లాభాలను అందించగలవని భావించిన పరిశోధకులు.. రోజుకు ఆరుసార్లు డంబెల్స్ ఎత్తడాన్ని తగ్గించడం కూడా కండరాల పెరుగుదలకు ప్రయోజనాన్ని అందించగలదని తెలుసుకున్నారు. డంబెల్‌ను కండరపు కర్ల్‌లో భుజాల వైపునకు పైకి లేపినప్పుడు మజిల్ పెరుగుదలకు తోడ్పడుతుందని.. ఇటువంటి అసాధారణ సంకోచం అనేది వ్యతిరేక దశ, బరువును తిరిగి తుంటి వైపునకు తగ్గించడం అనేది పొడవును పెంచుతుందని చెప్పారు. ఈ కారణంగా పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే కండర సంకోచాలకు కారణమయ్యే రన్నింగ్, జంపింగ్ వంటి వ్యాయామాలు ఆరోగ్యకరమైన శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పరిశోధకులు భావించారు.

Also Read..

స్త్రీలు మంగళవారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే ఎంతో మంచిదంట?

Advertisement

Next Story

Most Viewed