Back Pain : యువతలోనూ వెన్నెముక సమస్యలు.. కారణం ఇదేనా?

by Javid Pasha |
Back Pain : యువతలోనూ వెన్నెముక సమస్యలు.. కారణం ఇదేనా?
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు వృద్ధుల్లోనే వెన్నెముక సమస్యలు ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం యువతలోనూ అధికం అవుతున్నాయి. నిశ్చల జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, పోషకాల లోపం, గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం, బరువులు తప్పుడు పద్ధతిలో ఎత్తడం వంటివి ఇందకు కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. అట్లనే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్ టాప్‌లు వంటివి ఎక్కువసేపు చూడటం కూడా వెన్నెముకపై ప్రభావం చూపుతోంది. ఇంకా ఏయే కారణాలవల్ల వెన్నెముక నొప్పి వస్తుంది? ఎలా నివారించాలో తెలుసుకుందాం.

*వ్యాయామాలు లేకపోవడం : ప్రతిరోజూ వ్యాయామాలు లేదా శారీరక శ్రమలేని జీవన శైలివల్ల కూడా వెన్నెముక బలహీనంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య ఐటీ రంగంలో డెస్క్ జాబ్ చేసే యువత ఉద్యోగులు ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నిశ్చల జీవనశైలి కారణంగా కండరాలు బలహీనపడతాయి. డిస్క్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నొప్పి, ఇతర సమస్యలు తలెత్తుతాయి.

*హెర్నియేటెడ్ డిస్క్ : హెర్నియేటెడ్ డిస్క్ పగిలినప్పుడు లేదా జారిపోయినప్పుడు నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చేతులు, కాళ్లల్లో నొప్పి లేదా తిమ్మిరి సమస్యలు వస్తాయి. వెన్ను నొప్పి కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అట్లనే జంక్ ఫుడ్, అధిక చక్కెరలు కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరంలో విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం లోపించడంవల్ల కూడా వెన్నెముక ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. ఊబకాయం ఉన్నప్పుడు వెన్నెముకపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య తలెత్తవచ్చు. అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటివి కూడా కండరాల్లో మార్పులకు కారణమై వెన్నెముక సమస్యలకు దారితీస్తాయి. దీంతో ఇటీవల యువతలో వెన్నెముక నొప్పి (Spinal pain ) పెరుగుతోంది. జీవనశైలిలో సరైన మార్పులు, రెగ్యులర్ వ్యాయామాలు, సమతుల్య ఆహారం, సరైన భంగిమలో కూర్చోవడం వంటివి వెన్ను నొప్పి సమస్య రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed