డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలా..? అయితే ఇది పాటించండి

by Hamsa |   ( Updated:2023-10-02 07:35:37.0  )
డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలా..? అయితే ఇది పాటించండి
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కూడా వాటి ప్రభావం బాగానే ఉంది. వాస్తవానికి ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. ఇటీవల చాలామంది దీనిబారిన పడుతున్నారు. కాబట్టి లక్షణాలు, నివారణ, ట్రీట్మెంట్ గురించిన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాధి బారిన పడినవారు తేలికపాటి సందర్భాల్లో కోలుకోవడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. మందులతోపాటు, కొన్ని ఆహార మార్పులు కూడా రికవరీని వేగవంతం చేస్తాయి. శరీరంలో కోల్పోయిన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు డెంగ్యూ రికవరీ ప్రాసెస్‌లో మీకు కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు హెల్ప్ అవుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

నీరు, కోకోనట్ వాటర్, పసుపు

డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడే పానీయాయాల్లో మొట్ట మొదటిది నీరు. రికవరీ సమయంలో బాగా హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి హై ఫీవర్, వాంతులు, విరేచనాల కారణంగా నిర్జలీకరణకు దారితీస్తుంది. ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్ కలిగిన నేచురల్ సోర్స్‌. అంతే కాకుండా హైడ్రేట్‌గా ఉండటానికి దోహదం చేస్తాయి. కడుపులో ఉబ్బరం వంటి ఇబ్బందిని నివారిస్తాయి. వాంతులు, వికారం వంటివి తగ్గిస్తాయి. మరొక చిట్కా ఏంటంటే. పసుపు కలిపిన పాలు. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే గోరువెచ్చని పాలతో చిటికెడు పసుపును కలిపి తాగడంవల్ల డెంగ్యూ బాధితులు కాస్త త్వరగా కోలుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయడంవల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

తాజా పండ్లు, అలోవెరా జ్యూస్

తాజా పండ్ల నుంచి తీసిన రసాలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగు పర్చడంలోఆరెంజ్, నిమ్మ, బొప్పాయి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని తినడం, జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల డెంగ్యూ బాధితులకు మేలు జరుగుతుంది. ఇక అలోవెరా జ్యూస్ విషయానికి వస్తే కలబందలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ స్మూతింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్‌ తాగడంవల్ల డైజెస్టివ్ డిస్ కంఫర్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మంట, కఫం వంటి ఇబ్బందులు ఉంటే తగ్గుతాయి. డెంగ్యూ బాధితుల్లో ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి బాధితులు వైద్యుల సలహా మేరకు మందులతో పాటు, లక్షణాలను తగ్గించడానికి, కోలుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పానీయాలను ఎంచుకోవాలి.

Advertisement

Next Story