Sneezing : తుమ్మేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకునేరు.. డేంజర్!

by Javid Pasha |
Sneezing : తుమ్మేటప్పుడు చేతులు అడ్డం పెట్టుకునేరు.. డేంజర్!
X

దిశ, ఫీచర్స్ : జలుబు చేసినప్పుడో, వాసనలు పడనప్పుడో తుమ్ములు ఆగకుండా వస్తుంటాయి. ఈ సందర్భంగా చాలామంది ముక్కుకు రుమాలు లేదా చేతులు అడ్డు పెట్టుకుంటారు. ఎందుకంటే ముక్కులోంచి వెలువడే తుంపర్లు గాలిలో వ్యాప్తి చెంది రోగాలకు కారణం అవుతాయని చెప్తారు. ఓ అధ్యయనం మాత్రం అలా చేయకూడదని చెబుతోంది. తుమ్మేటప్పుడు చేతులు అడ్డంగా పెట్టుకుంటేనే డేంజర్ అంటోంది. ఎందుకంటే.. ముక్కులోని వైరస్‌లు చుట్టూ ఎగరవని, ఇతరులను అనారోగ్యానికి గురి చేయవని నిపుణులు చెబుతున్నారు.

స్టడీలో భాగంగా నిపుణులు 20 నుంచి 55 ఏండ్ల మధ్య గల వ్యక్తులను అబ్జర్వ్ చేశారు. అయితే వీరిలో తుమ్మేటప్పుడు చేతులు, కర్చీఫ్ ముక్కుకు అడ్డం పెట్టుకునే వారిలో 28 శాతం మంది చెవి పోటుకు గురైనట్లు గుర్తించారు. అందుకు కారణం తుమ్మేటప్పుడు ముక్కుకు, నోటికి చేతులు లేదా రుమాల్‌ అడ్డు పెట్టుకోవడమేనట. పైగా తుమ్ములను బలవంతంగా అణచివేయడం వల్ల ముఖం, శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది. అప్పటికే చెవి సంబంధిత సమస్యలు ఉంటే అధికం అవుతాయి. వినికిడి లోపం ఏర్పడవచ్చు. అట్లనే ముక్కులో, చెవుల్లో నూనె పోయడం, ఇతర ద్రవాలు పోయడం వంటివి చేయకూడదంటున్నారు నిపుణులు.

తుమ్ములు ఎందుకు వస్తాయ?

* తుమ్ములు రావడం సహజమే. అయితే అవి ఎందుకు వస్తాయనే సందేహం కూడా పలువురికి ఉంటుంది. నిపుణుల ప్రకారం.. ముక్కు లేదా గొంతులో చికాకు పొందడంవల్ల తుమ్ములు వస్తాయి. అంతే కాకుండా ఇది ప్రతీ వ్యక్తిలో సహజంగా ఉండే మానవ లక్షణం. అంటే అవాంఛిత కణాలను తొలగించే సేఫ్టీ రెప్పాండ్ లేదా రియాక్షన్. తుమ్ములు సాధారణంగా తీవ్రమైన అనారోగ్యానికి దారితీయవు.

* ముఖ్యంగా పుప్పొడి, ధూళి, బూజు, చెట్ల పొరల్లోని డస్ట్, బ్యాడ్ లేదా గుడ్ స్మెల్ వంటివి అలెర్జీలకు, తుమ్ములకు కారణం కావచ్చు. ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం, ఫ్లూ వంటివి కూడా తుమ్ములకు దారితీస్తుంటాయి. గొంతులోకి ప్రవేశించే చికాకులు, హైపోకస్ లైట్లకు గురికావడం, గాలి కాలుష్యం, కాంతి కాలుష్యం వల్ల కూడా తుమ్ములు వస్తుంటాయి. కొన్ని రకాల స్ర్పేలు, కార్టికోస్టెరాయిడ్స్ తుమ్ములకు కారణం కావచ్చు. అయితే తుమ్ములను బలవంతంగా అణచి వేయకూడదు. అట్లనే చేతులు, రుమాలు నోరు, ముక్కును మూస్తూ తుమ్మకూడదు. అటు వైపు మళ్లి తుమ్మడం కానీ, శుభ్రమైన రుమాలు లేదా చేతులు మొహానికి దూరంగా పెట్టి తుమ్మడం గానీ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story