- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆత్రుత ఎక్కువైనా ఆరోగ్యంపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే..
దిశ, ఫీచర్స్ : ప్రతీ విషయంలో బిగ్గరగా మాట్లాడేవారు, తరచూ చిరాకు పడేవారు, పరిమితికి మించిన ఆత్రుత, ఆందోళన కనబర్చే వారు అందుకు భిన్నంగా ఉండే స్లో మూవర్స్‌తో పోల్చితే అధికి ఒత్తిడికి గురవుతుంటారని వన్‌పోల్ సంస్థ 2000 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. చిరాకు వల్ల ఏర్పడే భావోద్వేగాలే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వ్యక్తులు చిరాకు లేదా కోపంగా ఉన్నప్పుడు అధికంగా ఆందోళనకు గురవుతుంటారు. ఈ విధమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఆ విషయాన్ని ముందుగా మెదడు గ్రహించగానే శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్, హార్మోన్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా శరీర భాగాలకు మరింత ఆక్సిజన్ అందజేయడానికి హృదయ స్పందనలు పెరుగుతాయి. తద్వారా బీపీ పెరుగుతుంది. బ్రీతింగ్ లెవల్స్‌లోనూ మార్పులు వస్తుంటాయి. ఇది దీర్ఘకాలంపాటు కొనసాగితే ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి పరిమితికి మించిన ఆందోళన, కోపం, చిరాకు, ఆత్రుత వంటి లక్షణాలు ఉన్నవారు జాగ్రత్త పడాలని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు సూచిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఆయా మానసిక పరిస్థితులు కలిగిన వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. అయితే ఆత్రుత, ఆందోళన, కోపం, చిరాకు వంటి బిహేవియర్స్ కలిగిన గ్రూపులోని వ్యక్తులు, అందుకు భిన్నంగా ఉండే స్లో మూవర్స్‌తో పోల్చినప్పుడు 32 శాతం అధికంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లుగా గుర్తించారు.