సముద్రపు నాచుతో పెరుగుతున్న స్కిన్ గ్లోయింగ్.. సాలిడ్ ఫీల్ ఇస్తుందట !

by Prasanna |   ( Updated:2023-09-04 08:05:24.0  )
సముద్రపు నాచుతో పెరుగుతున్న స్కిన్ గ్లోయింగ్.. సాలిడ్ ఫీల్ ఇస్తుందట !
X

దిశ, ఫీచర్స్: హై క్వాలిటీ స్కిన్ గ్లోయింగ్ మాయిశ్చరైజర్స్ వాడినా మీ ముఖంలో షైనింగ్ రావట్లేదా? అయితే సముద్రపు నాచును ట్రై చేయవచ్చు. ఎందుకంటే దీని ద్వారా తయారు చేసిన జెల్ అద్భుతమైన చర్మ సౌందర్యానికి దోహదం చేస్తుందని సింగ‌పూర్‌కు చెందిన డెర్మటాలజిస్టుల అబ్జర్వేషన్‌లో వెల్లడైంది. పైగా ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుందని, దృఢమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్తున్నారు. బిజీ రొటీన్స్ వల్ల, అలాగే దీర్ఘకాలిక ఒత్తిడులవల్ల చాలామంది తమ స్కిన్ గ్లోయింగ్‌పై శ్రద్ధ వహించడం మర్చిపోతుంటారు. కొందరు తమ ముఖంపై చర్మంలో డెత్ సెల్స్ ఏర్పడి ఇబ్బందికరమైన రూపంతో ఆత్మ న్యూనత భావానికి గురవుతుంటారు. ఇక నుంచి ఇలాంటివారు కూడా సముద్రపు నాచును అప్లయ్ చేయడంవల్ల బెనిఫిట్స్ పొందవచ్చు. ఎందుకంటే దీనితో తయారు చేసిన జెల్‌లో స్కిన్ హెల్త్‌కు అవసరమైన మినరల్స్, విటమిన్స్, ముఖ్యంగా విటమిన్ ఎ, ఇ, కె ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి హై క్వాలిటీ మాయిశ్చరైజర్స్ కంటే సముద్రపు నాచుతో తయారు చేసిన జెల్స్ లేదా రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రజెంట్ ‘సీ మాస్ ఫెయిర్ నెస్ జెల్’ రూపంలో ఇవి అందుబాటులో ఉంటున్నాయి.

Read More: నక్షత్ర మండలంలో మరో వింత.. డార్క్ మాటర్‌లేని గెలాక్సీని గుర్తించిన పరిశోధకులు

Advertisement

Next Story