- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్రంలో పవర్ న్యాప్.. 300మీటర్లకు కూరుకుపోవడంతో..
దిశ, ఫీచర్స్: సముద్రపు క్షీరదాలు విశ్రాంతి కోసం అనేక ఉపాయాలు చేస్తాయి. ఈ క్రమంలోనే ఎలిఫెంట్ సీల్స్ కూడా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తాయని తెలిపిన కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ సైంటిస్టులు.. పవర్ న్యాప్ టైమ్‌లో వింతగా ప్రవర్తిస్తాయని చెప్పారు. సాధారణంగా గాలి పీల్చే జంతువు సముద్రంలో సురక్షితంగా నిద్రించడం కష్టమే కానీ ఈ క్షీరదం మాత్రం సక్సెస్‌ఫుల్‌గా 10 నిమిషాలు పడుకుటుందని వివరించారు.
శత్రువుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా సముద్రంలో 100 మీటర్ల లోతులోనే నిద్రకు ఉపక్రమించే ఎలిఫెంట్ సీల్.. నిద్రలో క్రమంగా దాదాపు 300 మీటర్ల వరకు కూరుకుపోతుందని చెప్పారు. భూమిపై 10 గంటలు నిద్రిస్తే.. లోపల రెండు గంటలు మాత్రమే పడుకుంటాయని వివరించారు. అయితే ఈ టైమ్‌లో వాటి బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రత్యేక సిస్టమ్‌ను డెవలప్ చేశారు సైంటిస్టులు. మెదడు కార్యకలాపాలు, హృదయ స్పందన రేటు, కదలికలు, హెడ్‌క్యాప్‌తో పాటు ఫిన్ కండరాల సంకోచాలను ట్రాక్ చేశారు. డీప్ స్లీప్, ర్యాపిడ్-ఐ-మూవ్‌మెంట్ (REM)లో ఉన్నప్పుడు ఎలా కదులుతున్నాయో గుర్తించారు. కాగా 300 మీటర్ల కన్నా ఎక్కువ లోతు వెళ్తున్నామని గ్రహిస్తున్న ఈ జంతువులు.. వెంటనే తిరిగి లేస్తున్నాయని గ్రహించినట్లు చెప్పారు. ఈ విధంగా శరీర స్థితిని నిర్వహించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందన్నారు శాస్త్రవేత్తలు.