- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలర్ చూసి మోసపోకండి..!

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం మార్కెట్‌లో ఆరెంజ్ పండ్లు ఎక్కువగా దర్శమిస్తున్నాయి. ఈ సీజన్‌లో వాటి ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఆరెంజ్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులో విటమిన్- సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, మార్కెట్‌లో లభించే ఆరెంజ్‌లు అన్నీ ఒకే రకంగా ఉండవు. చూడడానికి ఒకేలా కనిపించినా అది సరైన పండు కాదు. అందుకే ఆరెంజ్‌ని కొనే ముందు వాటిని పరిశీలించాలి.
చాలామంది పండు రంగుని చూసి కొంటుంటారు. పండు నిగనిగలాడుతుంటే అది మంచిదేనని దానిని కొంటారు. నిజానికి పండు రంగుని చూసి అది మంచిదా? కాదా? అనే నిర్ణయం తీసుకోకూడదు. కొన్ని సార్లు ఆరెంజ్ పండ్లు చూడడానికి బాగున్నా.. లోపల మాత్రం కుళ్లిపోయి ఉంటుంది. అందుకే ఆకుపచ్చటి రంగు ఉన్న ఆరెంజ్‌లు తీసుకోవడం మంచిది. కొందరు పలుచని తొక్క ఉన్న ఆరెంజ్‌ల కంటే మందంగా ఉన్న ఆరెంజ్‌లు బాగుంటాయని అనుకుంటారు. కానీ, పండు తొక్క మందంగా, ఎండినట్లు ఉన్నట్లైతే దాని నాణ్యత క్షీణించడం మొదలైందని అనుకోవాలి. అందుకే మందంగా ఉన్న ఆరెంజ్ పండ్లను తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఆరెంజ్ పండ్లపై మచ్చలు గనుక ఉంటే వాటిని తీసుకోకపోవడమే మంచిది.
అయితే, ఆరెంజ్ పండ్లను తీసుకునేటప్పుడు సరైన పండ్లను మీరే ఎంచుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్న పండ్లు అయితే, వాటిలో రసం ఎక్కువగా ఉండడంతో పాటుగా ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అందుకే వీటిని తీసుకునే ముందు వాటి బరువును చెక్ చేసుకోవాలి. పండ్లును తీసుకునేటప్పడు వాటిని ఒకసారి నొక్కి చూడాలి. అలా నొక్కినప్పడు అది గట్టిగా ఉంటే పచ్చి నారింజ అని, అలా కాకుండా వెంటనే రంధ్రం పడితే అది పండిన నారింజ అని తెలుసోవాలి. కొన్ని సందర్భాల్లో విక్రయదారులు ఇచ్చే పండ్లు సరైనవిగా ఉండవు. అందుకే మీరే సరైన పండ్లను తీసుకోవడం మంచిది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.