వేడి నీటి కోసం హీటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..?

by sudharani |
వేడి నీటి కోసం హీటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా పెరిగింది. మామూలు రోజుల్లోనే చాలా మంది స్నానానికి చల్లటి నీటిని ఇష్టపడరు. ఇంకా శీతాకాలం వచ్చిందంటే చాలు.. వేడి నీళ్లు లేకపోతే స్నానాలు కాదు కదా.. బ్రెస్ చెయ్యడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇక మన అమ్మమ్మల నాటి కాలంలో కట్టెల పొయ్యి ఉండటంతో దానిపై నీటిని మరిగించి అవి ఉపయోగించేవారు. తర్వాత రోజుల్లో గ్యాస్ పొయ్యిల పై నీళ్లు మరిగించే వారు. ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది. నీరు వేడి చేసుకునేందుకు హీటర్, గీజర్ లాంటివి అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో కట్టెల పొయ్యిలు, గ్యాస్ పొయ్యిలు ఎవరు ఉపయోగించడం లేదు. అయితే.. మనం వాడే హీటర్ కారణంగా సులభంగా వాటర్ హీట్ చేసుకోవచ్చు కానీ, కొన్ని ప్రమాదాలు కూడా తప్పవు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హీటర్ (ఇమ్మర్షన్ రాడ్) కారణంగా ప్రాణాపాయం కూడా ఉంది.

* హీటర్ (ఇమ్మర్షన్ రాడ్) వంటివి ఉపయోగించినప్పుడు అవి స్నానపు గదిలో కానీ, మనుషులు తిరిగే చోట, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఉంచకూడదు.

* చాలా మంది హీటర్‌ను వాటర్‌లో పెట్టి మర్చిపోతుంటారు. ఇర్మర్షన్ రాడ్ మాన్యువల్‌గా పనిచేస్తుంది. ఆటో స్విచ్చాఫ్ ఉండదు. ఒక్కో సమయంలో ఇది షాట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి.

* హీటర్ వాటర్‌లో పెట్టిన తర్వాత.. చాలా మంది వాటర్ వేడిగా అయ్యాయో లేదో అని స్విచ్ ఆఫ్ చేయకుండానే వాటిలో వేలు పెడతారు. ఇలా చేయడం కారణంగా చాలా సందర్భాల్లో షాక్ కొట్టి చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి.. ఫ్లగ్ నుంచి వైర్ వేరు చేసిన తర్వాత వాటర్‌లో చేయి పెట్టాలి.

* ముఖ్యంగా హీటర్ ఉపయోగించే వాళ్లు మెటల్ బకెట్స్ ఉపయోగించ కూడదు. షాక్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హీట్ తట్టుకునే ప్లాస్టిక్ బకెట్స్ ఉపయోగించడం మంచిది.

* భద్రత అనేది చాలా ముఖ్యం. కాబట్టి డబ్బుల విషయంలో రాజీ పడకుండా నాణ్యతతో ఉన్న హీటర్ కొనుగోలు చేసుకోవడం ముఖ్యం. నాణ్యత లేని హీటర్ల కారణంగా ఎక్కువ సార్లు ప్రమాదాలకు జరిగే అవకాశం ఉంటుంది.

* ఇక వాటర్ హీట్ ఎక్కిన తర్వాత.. స్విచ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల తర్వాత బకెట్ నుంచి హీటర్ బయటకు తియ్యాలి. లేదంటే.. అది వేడిగా ఉండి కాలే ప్రమాదం కూడా ఉంటుంది.

Next Story