- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bitter Gourd: కాకరకాయను ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే, వీటి గురించి తెలుసుకోవాల్సిందే..!

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది కాకరకాయను ( Bitter Gourd ) ఇష్టంగా తింటారు. వీటిని తినడం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అందుకే, వైద్యులు కాకరకాయ జ్యూస్‌ను తాగమని చెబుతున్నారు. వీటి వలన షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే, జీర్ణవ్యవస్థ పని తీరు కూడా మెరుగుపడుతుంది. మలబద్దక సమస్య కూడా తగ్గుతుంది. అయితే, కాకరకాయలను మితి మీరు తింటే కొత్త సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు.
కాకరకాయలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అధికంగా తీసుకోకూడదు. అలాగే, వీటి జ్యూస్‌ను రోజూ 30 ఎంఎల్‌కు మాత్రమే తీసుకోవాలి. మరీ, అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
కాకరకాయలను మోతాదుకు మించి తినడం వలన లివర్ పనితీరును మందగిస్తుంది. దీంతో, తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవ్వదు. అది అజీర్తి వంటి సమస్యలకు దారి తీస్తుంది. అదే పనిగా దీనిని తినడం వలన కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.