పూజలో నిమ్మకాయ ఎందుకు వాడుతారో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-08 05:50:07.0  )
పూజలో నిమ్మకాయ ఎందుకు వాడుతారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ పూజ అయినా సరే నిమ్మకాయలు తప్పని సరి, ప్రతీ పూజలు వీటి ఉంచుతారు. ఎందుకంటే ప్రతికూలశక్తులు రాకుండా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందని అందరి నమ్మకం. అయితే అసలు నిమ్మకాయలకు ఉన్న ఆ పవర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల నిమ్మకాయ చరిత్ర వేద యుగం నాటిది. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు, బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడు అయ్యాడు. ప్రజలను వేధించాడు. అతడి క్రూరమైన పనులతో కలత చెందిన ఋషి అగస్త్యుడు.. భూమిని ఆ రాక్షసుడి నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు. నింబాసురుడిని అంతం చేయమని దుర్గా మాతను ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన అమ్మవారు.. నింబాసురుడిని సంహరించి భూమిని సస్యశ్యామలం చేశారు. అందుకే అమ్మవారిని శాఖంబరీ దేవి రూపంలోనూ పూజిస్తారు.

శాఖంబరీ దేవి యొక్క దివ్యశక్తిని చూసి, తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకున్నాడు. దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు.అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడతాడని ప్రకటించింది. అప్పటి నుంచి నిమ్మకాయ హిందూ ఆచారాలలో నిమ్మకాయ ముఖ్యమైన భాగంగా మారిందని అంటారు

Read More: శ్వేతనాగుపాములు నిజంగానే పగపడుతాయా?

Advertisement

Next Story

Most Viewed