ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల బాడీలోని ఏ పార్ట్స్ పాడవుతాయో తెలుసా?

by Anjali |   ( Updated:2023-09-04 05:58:31.0  )
ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల బాడీలోని ఏ పార్ట్స్ పాడవుతాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం ఎక్కువగా తాగడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా.. ప్రస్తుత రోజుల్లో మద్యం తాగే వారి సంఖ్య విపరీతమైన స్థాయిలో పెరుగుతోంది. కాగా అతిగా మందు తాగడం ద్వారా ఏ ఏ భాగాలపై అధికంగా ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం..

* ఆల్కహాల్ వల్ల ‘జీర్ణ వ్యవస్థ’పై ప్రభావం చూపుతుంది. గ్యాస్ ఉబ్బరం, విరేచనాలు అండ్ పొత్తి కడుపు నిండుగా ఉన్నట్లుగా ఇబ్బందిగా ఉండటం, పూతలకు దారితీయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

* శరీరంలో అతి ముఖ్యమైన పార్ట్.. కాలేయం దెబ్బతింటుంది.

* ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వంటి ‘నరాల సమస్యలు’ వస్తాయంటున్నారు నిపుణులు.

* ఒకేసారి మూడు కంటే ఎక్కువ పానీయాలు తీసుకోవడం ద్వారా తాత్కాలికంగా ‘రక్తపోటు’ పెరుగుతుంది.

* అలాగే ఎంజైమ్‌లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. ఎక్కువగా మద్యం సేవించడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు.

Read More: సూసైడ్ థాట్స్‌ను ముందే గుర్తిస్తున్న ఏఐ.. ఎలాగో తెలుసా?

Advertisement

Next Story