చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-12 15:35:49.0  )
చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతి రోజూ స్నానం చేయడం అవసరం. స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీయా, వైరస్, మురికి తొలగిపోతుంది. అయితే, చాలామంది ఆరోగ్య పరంగా, సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. మరికొందరు చలికాలంలో కూడా చన్నీటి స్నానం చేస్తారు. చాలామంది శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలంటే వణికిపోతారు. అయితే, వేడి నీటి కంటే చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల ఏం జరుగుందో ఇప్పుడు తెలుసుకోండి.

రక్త ప్రసరణ: శీతాకాలంలో చల్లని నీటితో స్నానం చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. బాడీలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో, రోగనిరోధక కణాలు మెరుగ్గా పనిచేస్తాయి. అంతేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో పోరాడే సామర్థాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక స్థితి: చల్ల నీళ్లు మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. శరీరంలో డోపామైన్, సెరోటోనిన్ స్థాయిలను చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీని వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

కండరాల నొప్పికి ఉపశమనం: కండరాల నొప్పులు ఉన్న వారు సాధారణంగా హాట్ వాటర్‌తో స్నానం చేస్తుంటారు. కానీ, వేడి నీటి కంటే కోల్డ్ వాటర్ కండరాల నొప్పుల నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది.

జుట్టుకు ఆరోగ్యం: వేడి నీళ్ల కంటే చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు నుంచి అదనపు నూనె, దుమ్ము వంటివి తొలగిపోతాయి. అంతేకాకుండా ఇది చర్మాన్ని పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.

చురుగ్గా ఉంటారు: ఉదయాన్నే కోల్డ్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల చర్మానికి విశ్రాంతి కలుగడమే కాకుండా..శ్వాస వేగంను పెంచుతుంది. తదుపరి శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకుంటుంది. దీని వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.

అయితే, చన్నీటి స్నానం మంచిదని నేరుగా చల్లటి నీటిని తలపై పోసుకోకండి. ముందు పాదాలు, చేతులను తడిపి తరువాత స్నానం చేయండి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు చల్లని నీటితో స్నానం చేయకండి.


Read More ...

Memories : మెదడే కాదు.. శరీరంలోని ఈ భాగంలోనూ జ్ఞాపకాలు నిక్షిప్తమవుతాయ్!




Advertisement

Next Story