Beetroot: రోజు ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

by D.Reddy |
Beetroot: రోజు ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: బీట్‌రూట్ (Beetroot).. పోషకాలు మెండుగా కలిగిన కూరగాయ. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు (Vitamins, minerals, antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత, రక్తపోటు, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇక బీట్‌రూట్‌ను పచ్చిగా, కూర చేసుకుని, జ్యూస్ చేసుకుని తీసుకొవచ్చు. మరి, పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ బీట్‌రూట్‌ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

రక్తహీనత సమస్య దూరం

బీట్‌రూట్‌లో A, B, C విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీటైన్, నైట్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే, బీట్‌రూట్‌లో నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి, రక్తనాళాలను విస్తరింపజేస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి, రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) స్థాయిలు తగ్గుతాయి. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య కూడా ఉండదు. బీట్‌రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. ఇందులోని బీటైన్ కాలేయాన్ని శుభ్రం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చటం

మన రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే గుండె పనితీరు కూడా బాగుంటుంది. ఈ విషయంలో బీట్‌రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బీట్‌రూట్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎముకల్ని దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. అలాగే, ఇందులో ఉండే బీటాసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ కణాల పెరుగుదలను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి కూడా నివారణను అందిస్తుంది.

చర్మ సమస్యలు దరిచేరవు

బీట్‌రూట్ రసం చర్మానికి మెరుపును ఇస్తుంది. వయసు పెరిగినా.. నిత్యం ఈ జ్యూస్ తాగితే చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక బరువు తగ్గాలి అనుకునే వారికి బీట్‌రూట్ మంచి ఎంపిక. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది జీవక్రియను పెంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎనర్జీ డ్రింక్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకొనే బదులు.. బీట్ రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సొంతం చేసుకోవచ్చు.

జ్ఞాపశక్తిని మెరుగుపర్చటం

బీట్‌రూట్‌లోని నైట్రేట్లు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఈ జ్యూస్ తాగితే.. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి జ్ఞాన సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో 55 సంవత్సరాలు.. అంతకంటే పైగా వయస్సు గల 26 మంది వ్యక్తులు ప్రతిరోజూ బీట్‌రూట్ రసం తాగడం ద్వారా మెదడు కనెక్టివిటీ మెరుగుపడిందని కనుగొన్నారు. అనారోగ్యాలను దూరం చేసి శరీరానికి ఎన్నో లాభాలను చేకూర్చే ఈ బీట్‌రూట్ జ్యూస్‌ను ఇంట్లోనే తాజాగా చేసుకుని తాగడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణలోని తీసుకునే మందు వైద్య నిపుణుల సూచనలకు తీసుకొవటం మంచిది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.




Next Story

Most Viewed