- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాజమాని జాతకాన్నే మార్చే నల్ల కుక్క !

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని రకాల మొక్కల్ని పెంచుకోవడం వలన అదృష్టం కలుగుతుందని, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జి పోతుందని చాలా మంది ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటారు. మరి విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండే కుక్కల్ని పెంచడం వలన కూడా లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. అయినా కొంత మంది జంతుప్రేమికులు కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. సరదాకోసమో, ఇంటి కాపలా కోసమో కుక్కలను పెంచుకుంటారు. అసలు ఏరంగు కుక్కలని పెంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయో, ఎలాంటి ఫలితాలు వస్తాయో, వాస్తు నిపుణులు ఏం సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కుక్కను పురాణాల్లో కాల భైరవుడితో పోలుస్తారని పండితులు చెబుతున్నారు. అలాంటి కుక్కను పెంచుకుంటే శని దేవుడి అనుగ్రహాన్ని త్వరగా పొందుతారట. శని దోషాలు ఉన్న వారు ప్రతినిత్యం కుక్కకు ఆహారం పెడితే శని తొలగిపోతుందట. చాలా మంది నల్లకుక్కను పెంచుకోవడానికి ఇష్టపడరు. కానీ నల్ల కుక్కను పెంచుకుంటే రాహు, కేతులు, శని గ్రహాల దోషం కొంతమేర తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. అంతే కాదు కుక్క ఇంట్లో తిరిగితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. కుక్కని పెంచుకోవడం వలన మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట.
అలాగే ఉదయం లేవగానే కుక్కను చూస్తే శుభాలు జరుగుతాయట. కుక్కను పెంచి దాని కడుపు నింపడం వలన ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. ఆ ఇంటికి శుభం కలుగుతుందంట. కుక్కకు ముద్ద అన్నం పెడితే చాలు యజమానిని మరవదు. యజమాని ఇంటికి ఎలాంటి ఆపద రాకుండా కాపలా ఉంటుంది. తన యజమాని కనిపించకపోయినా, దూరమై పోయినా ఎంతో బాధపడుతుంది. కప్పునిండా పాలు పోస్తే చాలు తోక ఊపుకుంటూ తన యజమాని వెంటే తిరుగుతూ ఆనందంగా ఉంటుంది. కుక్కలకి ఎంత ఆనందం కలిగిస్తే ఆ ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీని పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కుక్కలని పెంచుకోని వారు ఓ బుజ్జి కుక్కను తెచ్చి పెంచుకోండి.