షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి...

by Shiva |   ( Updated:2023-06-25 04:24:13.0  )
షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఇలా చేయండి...
X

దిశ, వెబ్ డెస్క్ : మధుమేహం (షుగర్) వయసుతో సంబంధం లేకుండా నేడు వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. ఓ సారి షుగర్ వచ్చిందంటే అది జీవితాంతం మన వెంటే ఉంటుంది. నిత్యం మందులను వాడుతూనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే.. ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వచ్చిన లక్షణాలు, వారు తినాల్సినవి..

షుగర్ వచ్చాక కొన్ని మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా మూత్ర విసర్జన, ఆకలి ఎక్కువగా వేయడం, కళ్లు సరిగా కనిపించకపోవడం, తూలినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ వ్యాధి వచ్చినట్లు నిర్ధారించుకోవాలి. షుగర్ వచ్చిన వారు స్వీట్లు తినకూడదు. తియ్యగా ఉండే పండ్లు తినకూడదు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినొచ్చు.

ఖచ్చితమైన డైట్..

మన జీవన శైలిని మార్చుకోవాలి. ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే మంచిది. వ్యాధి రాకముందు అన్నం ఎక్కువగా తిన్న వారు డయాబెటిస్ వచ్చిందంటే మన ఆహార అలవాట్లు సరిగా చూసుకోవాలి. లేకపోతే షుగర్ పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డైట్ ను కచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

మద్యపానానికి దూరంగా ఉండాలి

మధుమేహం ఉన్న వారు అల్కహాల్, పొగ తాగకూడదు. ఈ అలవాట్లు ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవాలంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బంగాళాదుంప, మొక్కజొన్న, బఠాణీలు తక్కువగా తీసుకోవాలి. మనకు బలం చేకూర్చే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.

వ్యాయామం తప్పనిసరి

డయాబెటిస్ కు గురైన వారు నిత్యం కొద్దసేపైనా వ్యాయామం చేయాలి. దీంతో గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు పెరుగుతాయి. దీంతో వ్యాయామం చేస్తే షుగర్ తగ్గుతుంది. చక్కెర నియంత్రణలో ఉంచుకునేందుకు మనం పలు రకాల ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మధుమేహం నియత్రణలోకి వస్తుంది.

Advertisement

Next Story