సెల్ఫీ మన ప్రాణాలు కాపాడుతోందని మీకు తెలుసా? ఎలా అంటే?

by Jakkula Samataha |
సెల్ఫీ మన ప్రాణాలు కాపాడుతోందని మీకు తెలుసా? ఎలా అంటే?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా, సరదాగా ఫ్రెండ్స్‌తో ముచ్చటించిన ఒక సెల్ఫీ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. మనం బాధలో ఉన్నా, అంతు పట్టని సంతోషంలో ఉన్నా..ఇలా ఎలా ఉన్నా సెల్ఫీ తీసుకోవడం దాన్ని చూస్తూ ఆనంద పడిపోవడం అనేది సహజమైపోయింది. అయితే కొంతమంది సెల్ఫీ తీసుకోవడం వలన ఫేస్ పాడైపోతుంది. సెల్ఫీలు తీసుకోకూడదు అని చెప్తుంటారు. కానీ సెల్ఫీలు కూడా ఒకరకంగా మనకు మంచే చేస్తున్నాయంట. సెల్పీ కూడా మన ప్రాణాలను కాపాడుతుంది అంటున్నారు పరిశోధకులు అసలు విషయంలోకి వెళ్లితే.. గుండె సంబంధి వ్యాధి లక్షణాలను గుర్తించడంలో సెల్ఫీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయంట.మన ముఖ లక్షణాలు..పాత సెల్ఫీలతో కొత్త సెల్ఫీలను పోల్చినప్పుడు కళ్ల కింద ఉబ్బు, నల్లటి వలయాల వంటి వాటిని గుర్తించి వైద్యుడిని సంప్రదించాలంట దాని వలన మన అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా సెల్ఫీలు మనకు అనేక విధాలుగా ఉపయోగ పడుతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఒత్తిడిని తగ్గించడంలో సెల్ఫీలు కీలక పాత్ర పోషిస్తాయంట. మనకు నచ్చిన సెల్ఫీలను చూసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా, ఇతర వ్యక్తులతో చాట్, వారి పాజిటివ్ కామెంట్స్ మీలో చిరునవ్వును కలిగించి ఒత్తిడిని తగ్గిస్తాయి.

  • మనం చాలా రోజుల క్రితం దిగిన సెల్ఫీలను మళ్లీ తిరిగి చూసుకుంటే అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, వలన మన మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది.

  • సెల్ఫీలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మనల్ని మనం చూసుకుంటే దాని ద్వారా మనలో కాన్ఫిడెన్స్ పెరిగి, అది విజయాలకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు.
Advertisement

Next Story