ఆగకుండా డ్యాన్స్ చేయడం కూడా ఓ వ్యాధి అని తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-03-29 07:40:46.0  )
ఆగకుండా డ్యాన్స్ చేయడం కూడా ఓ వ్యాధి అని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుటున్నాం. ఇక చరిత్రలో నిలిచి పోయిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటే మనం ఎంతగానో ఆశ్చర్య పోతుటాం. అయితే డ్యాన్స్ చేయడం ఓ కళ. కొందరు మెల్లిగా డ్యాన్స్ చేస్తారు, మరికొందరు చాలా వేగంగా, ఆగకుండా డ్యాన్స్ చేస్తారు. అయితే దాదాపు 500 ఏళ్ల క్రితం ఆగకుండా డ్యాన్స్ చేయడం కూడా ఓ వింత వ్యాధి అంట. డ్యాన్సింగ్ ప్లేగ్ ఇదో అరుదైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు ఆగకుండా డ్యాన్స్ చేస్తూ చివరికి చనిపోయేవారు. ఆగకుండా డ్యాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం అంటున్నారు నిపుణులు.

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్ బర్గ్ అనే నగరంలో 1518లో జూలై నెలలో మొదటి సారి ఓ మహిళ వింతగా ప్రవర్తిచడం మొదలు పెట్టింది. ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంది. దీంతో ఇది చూసిన కొందరు ఆమెకు పిచ్చిలేసిదంని నవ్వుకున్నారు. కానీ ఆమె ఇంట్లో, బయట ఇలా ఎక్కడ చూసినా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. తర్వాత మరో ఇద్దరికీ ఇలా 400 మంది వరకు ఈ వ్యాధి సోకింది. దీని వలన 100 మంది చనిపోయారు. డ్యాన్స్ చేసి చేసి నీరసించి మరణించారు. ఇక దీంతో అప్పటి ప్రభుత్వం కూడా వారికి ఎలాంటి చికిత్స చేయాలో తెలియక చేతులెత్తేసింది. అయితే ఈ వ్యాధి సోకడానికి కారణం ఏమిటని రీసెర్చ్ చేయగా,వారు ‘రై పిండి’తో చేసిన రొట్టెలను తినే వారని తేలింది. ఆ పిండిలో వచ్చిన కల్తీ కారణంగా లేదా ఫంగస్ వల్ల ఇలా అందరికీ ఈ డాన్సింగ్ ప్లేగ్ వ్యాధి వచ్చినట్టు భావించారు.కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.

Read More..

గుడ్ ఫ్రైడే స్పెషల్.. ఐదు రొట్టెలు, రెండు చేపల అసలు కథ ఇదే!

Advertisement

Next Story

Most Viewed