- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగస్వామి గడ్డంవల్ల మొటిమలు వస్తున్నాయా? .. ఈ జాగ్రత్తలు పాటించండి
దిశ, ఫీచర్స్ : గడ్డం కలిగి ఉన్న భాగస్వామివల్ల కొందరు మహిళలు చర్మ సమస్యలు ఎదుర్కొంటుంటారని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ముఖ్యంగా కిస్ చేసినప్పుడు, కలయిక సమయంలో గడ్డం వెంట్రుకలకు, చర్మానికి మధ్య ఘర్షణ సేబాషియస్ గ్రంధులను ప్రేరేపించడం మూలంగా ‘సెబమ్’ ఉత్పత్తిని అవుతుందని చెప్తున్నారు. అయితే ఈ సెబమ్ ఉత్పత్తి చెంపలు, ఇతర శరీర భాగాల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కారణం అవుతుందట. అది స్కిన్‌పై మరింత ఆయిల్‌ను ప్రొడ్యూస్ చేయడంవల్ల చర్మం ఎర్రబారడం, మొటిమలు పెరగడం, దద్దుర్లు, దురద వంటి సమస్యలు ఎదురవడం జరుగుతాయి. కొందరిలో అలెర్జీలు కూడా వస్తాయి. ‘‘భాగస్వామి గడ్డం వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. మొదట గడ్డం వెంట్రుకలు ముతకగా, మురికిగా ఉంటాయి. ఇవి చర్మంపై ఘర్షణకు, చికాకుకు దారితీస్తాయి. ఈ ఘర్షణ చర్మంపై సూక్ష్మ-రాపిడిని కలిగిస్తుంది. దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది’’ అని డెర్మటాలజిస్టు కావ్య అంటున్నారు. అంతేకాకుండా గడ్డం పర్యావరణం నుంచి బ్యాక్టీరియా, ధూళి, అలెర్జీ కారకాలను గ్రహిస్తుంది. ఇది సన్నిహిత పరస్పర చర్యల సమయంలో భాగస్వామి చర్మంలోకి వెళ్తుంది. ఫలితంగా అలెర్జీలకు, దద్దుర్లకు, ఇతర చర్మ వ్యాధులకు దారితీయవచ్చు.
ఇలా నివారించవచ్చు
గడ్డం ఉన్నవారు సున్నితమైన క్లెన్సర్‌తో క్రమం తప్పకుండా కడగడం ద్వారా పరిశుభ్రతను కొనసాగించాలి. దీనివల్ల చర్మ సమస్యలకు దోహదపడే మురికి, బ్యాక్టీరియా, చర్మంపై జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే డ్రై నెస్, ఇరిటేషన్‌ను నివారించడానికి గడ్డం కింది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. పరిశుభ్రతలో భాగంగా ట్రిమ్మింగ్, షేపింగ్ సరైన క్రమంలో ఉంచుకోవాలి. చర్మంపై కఠినమైన లేదా రాపిడి కలిగించే సౌందర్య ఉత్పత్తుల వాడకాన్ని నివారించాలి. ఎందుకంటే అవి స్కిన్‌లో నాచ్యురాలిటీని దెబ్బతీస్తాయి. చర్మ సంరక్షణకు సంబంధించిన ఆయిల్ ప్రొడ్యూస్ కాకుండా అడ్డుకుంటాయి. అలాగే నిద్రిస్తున్నప్పుడు గడ్డం నుంచి భాగస్వామి చర్మానికి బదిలీ అయ్యే బ్యాక్టీరియాను అనువైన పరిశుభ్రమైనా పిల్లోస్ వాడాలి.
Also Read..
మీ శృంగార శబ్దాల వల్ల నిద్రపట్టడం లేదు.. లేఖ రాసి బీర్లు పంపించిన యువతి.. ట్వీట్ వైరల్
గోల్డెన్ చైల్డ్ సిండ్రోమ్.. పిల్లల్లో ఒకరికి ప్రాధాన్యత ఇస్తున్న తల్లిదండ్రులు