- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైలెవల్ షుగర్ యాడింగ్ ఫుడ్‌తో కిడ్నీ స్టోన్స్.. ప్రాణాంతకం కూడా !
దిశ, ఫీచర్స్ : సోడా, ఫ్రూట్ డ్రింక్స్, చాక్లెట్, ఐస్ క్రీం, అదర్ అల్ట్రా-ప్రాసెస్డ్ ఐటమ్స్, పిజ్జా, బర్గర్, కుకీలు, కేకులు, సోడా వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం అధికంగా ఉందని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఈ విధమైన స్నాక్స్‌లో ఉండే అధిక స్థాయి చక్కెరలు అందుకు దోహదం చేస్తాయని చైనాలోని నార్త్ సిచువాన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు చెప్తున్నారు. స్టడీలో భాగంగా 28,000 పైగా అమెరికన్ అడల్ట్స్‌కు సంబంధించిన హెల్త్ డేటాను ఎనలైజ్ చేసిన సైంటిస్టులు.. ఈ విషయాన్ని గుర్తించారు.
కిడ్నీ స్టోన్స్ బాధితులందరూ తరచూ హయ్యర్ షుగర్ యాడింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే హిస్టరీ కలిగి ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. ఇక రెగ్యులర్‌గా ప్రాసెస్ చేసిన ఫుడ్ అధికంగా తీసుకుంటున్న ప్రతీ 10 మందిలో ఒకరు లేదా ఇద్దరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గమనించారు. స్టోన్స్ ఫామ్ అయ్యాక మొదటి దశలో బాధితులు యూరిన్ చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు, చలి, జ్వరం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాలక్రమేణా ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండాల వాపు, ప్రాణాంతక కిడ్నీ వ్యాధులకు దారితీయవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఇక యుక్త వయస్కుల్లో అయితే ఒబేసిటీ, దీర్ఘకాలిక విరేచనాలు, డీహైడ్రేషన్, ఇన్‌ఫ్లమేటరీ బోల్ డిసీజ్, డయాబెటిస్ వంటి అనారోగ్యాలకు ప్రాసెసింగ్ ఫుడ్ ప్రధాన కారణంగా ఉంటోందని వెల్లడించారు. అందుకే వాటిని నివారించడం మంచిదని సూచిస్తున్నారు.
Read More: సమాజానికేంటి ఉపయోగం?.. తమ ఉద్యోగాలను ‘అర్థం లేనివి’గా భావిస్తున్న 32 శాతం మంది