- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పిల్లలు సరదాగా పుస్తకాలు చదువుతున్నారా? అయితే మీకు ఢోకా లేనట్లే.. కచ్చితంగా సక్సెస్ అవుతారు..
దిశ, ఫీచర్స్ : మూడు నుంచి తొమ్మిదేళ్ల వయసు మధ్య సరదాగా చదవడం ప్రారంభించిన పిల్లలు యుక్తవయసుకు చేరుకునే సమయానికి ఇంటెలిజెంట్స్‌గా మారారని తెలిపింది యూకే, చైనా సైకాలజిస్టుల అధ్యయనం. ఈ చిన్నారుల యంగ్ ఏజ్‌లో పరీక్షల్లో మెరుగైన స్కోర్ పొందుతున్నారని గుర్తించారు. అంతేకాదు ఈ అలవాటు మెరుగైన మానసిక ఆరోగ్యం, తక్కువ స్క్రీన్ టైమ్, గుడ్ స్లీప్‌తో ముడిపడి ఉంటుందని తెలిపారు. పదేళ్ల తర్వాత చదవడం ప్రారంభించిన పిల్లలతో పోలిస్తే లైఫ్‌లోనూ మెరుగ్గా రాణించగలరని చెప్తున్నారు.
బ్రెయిన్ డెవలప్‌మెంట్, పిల్లల ఆరోగ్యంపై చేసిన దీర్ఘకాలిక అధ్యయనంలో 10,243 మంది పిల్లలను పరిశీలించారు. వీరిలో 9-11(2016-2018) ఏజ్ గ్రూప్‌తో పాటు 11-13(2017-2020) ఏళ్ల వయసులో సేకరించిన డేటాను అనుసరించారు. ఇంటర్వ్యూలు, అభిజ్ఞా పరీక్షలు, మానసిక, ప్రవర్తనా అంచనాలు, బ్రెయిన్ స్కాన్‌తో సహా కౌమార మెదడు అభివృద్ధి గురించి పరిశీలించారు. ఇక ఇంటర్వ్యూలలో పిల్లలు ఆనందం కోసం ఎప్పుడు చదవడం ప్రారంభించారని, వారానికి ఎన్ని గంటలు చదవడం ఆరంభించారని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
వీరిలో 52శాతం మంది మూడు నుంచి తొమ్మిదేళ్ల మధ్య ఆనందం కోసం చదవడం స్టార్ట్ చేశారని తెలియగా.. మిగిలిన వారితో పోలిస్తే వీరు కౌమారదశలో అభిజ్ఞా పరీక్షలు, స్కూల్ టెస్ట్‌ల్లో సానుకూల పనితీరు కనబరిచారు. అయితే ఆస్ట్రేలియా, యూఎస్‌లో ఫన్ కోసం చదివే స్థాయిలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు వచ్చాయి. ఇక ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం పిల్లలు ఆనందం కోసం చదవడం 2018లో 79% ఉంటే 2022లో 72%కి పడిపోయింది. యూఎస్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన సర్వే డేటా ప్రకారం 13 ఏళ్ల వయస్సులో దాదాపు మూడింట ఒక వంతు మంది తాము ఎప్పుడూ వినోదం కోసం చదవలేదని చెప్పారు.
Read More: ఈ అలవాట్లు లేకపోతే ఇక మీ లైప్ సూపర్