కాలేజీ ఫేర్‌వెల్‌లో కార్ల‌తో దుమ్మురేపే స్టంట్‌లు.. చివ‌రికి..?! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-10-10 14:42:53.0  )
కాలేజీ ఫేర్‌వెల్‌లో కార్ల‌తో దుమ్మురేపే స్టంట్‌లు.. చివ‌రికి..?! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'కుర్రాళ్లోయ్ కుర్రాళ్లూ.. వెర్రెక్కీ ఉన్నోళ్లు..!!' అన్న‌ట్లు కుర్రాళ్ల దూకుడుకు క‌ళ్లెం వేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఈ వెర్రికి లెక్కాప్ర‌తాలు, అర్థంప‌ర్థం కూడా అడ‌క్కూడ‌దు, ఎందుకిలా చేసేదని అడిగినా దానికి స‌మాధానం వాళ్ల‌కే తెలియ‌దు కాబ‌ట్టి అదీ ఉప‌యోగం ఉండ‌దు. కానీ, యూత్ అంటేనే ఉత్సాహం.. అయితే, అది ఒక్కోసారి ఉన్మాదానికి, ప్ర‌మాదానికి కూడా గురికావ‌చ్చు. ఇలాగే, ఇటీవ‌ల కేర‌ళ‌లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కార్లు, బైక్‌లతో విద్యార్థులు చేసిన వీడ్కోలు వేడుకలు హద్దులు మీరాయి. కాలేజీ గ్రౌండ్‌లో కార్లు, బైకుల‌తో సాహ‌స విన్యాసాలు ప్రదర్శిస్తుండగా.. ఓ కారు వేగంగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు కేర‌ళ‌లో ష‌రామామూలే అయిపోయాయి. అయినా, పాఠశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నడకావు పోలీసులు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కార్లు నడిపిన ముగ్గురు విద్యార్థుల లైసెన్సులు రద్దు చేస్తున్నట్టు మోటార్ వాహనాల శాఖ తెలిపింది. కార్ రేసింగ్ నిర్వహించినందుకు ఒక్కొక్కరికి రూ.4000 జరిమానా విధించారు. వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పెట్ట‌డానికే ఈ విన్యాసాలు చేశామ‌ని విద్యార్థులు కుయ్యోమోర్రో అని బ‌తిమాలుకున్నారు. ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని ఊహించి, ఫేర్‌వెల్ డే రోజు విద్యార్థులు వాహనాలు తీసుకురావద్దని పాఠశాల యాజమాన్యం ఆదేశించిన‌ప్ప‌టికీ ఇలా చేసి, బుక్ అయినందుకు కుర్రాళ్లు బాధ‌ప‌డుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed