- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Smoking: తస్మాత్ జాగ్రత్త!.. స్మోకింగ్‌తో కంటి చూపు కోల్పోవడం ఖాయం అంటున్న నిపుణులు..
దిశ, ఫీచర్స్: ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని పలు సీరియల్స్‌లో, సినిమాలలో, పేపర్స్‌లో ఆఖరికి సిగరేట్స్ ప్యాకేట్స్‌పై, మందు బాటిల్స్‌పై కూడా రాసి ఉంటుంది. అయినా చిన్నా పెద్దా అని తేడా లేకుండా విపరీతంగా తాగుతూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా దీనికి అలవాటు పడుతున్నారు. అయితే పదే పదే ధూమపానం చేయడం వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులను తీసుకొస్తుంది. అంతే కాకుండా వాటిని తాగి తాగి లంగ్స్ కూడా పాడైపోతాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. స్మోకింగ్ కారణంగా కంటి ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
*ధూమపానం చేసేవారిలో వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ముప్పు ఎక్కువగా ఉంటుందని, అలాగే దృష్టి సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
*కేవలం స్మోకింగ్ చేసే వారికి మాత్రమే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా కళ్ళపై హానికరమైన ప్రభావాలు పడతాయట. అందుకే ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఉండకపోవడమే మంచిది అని చెబుతున్నారు.
* ఎక్కువగా ధూమపానం చేయడం వల్ల కంటి శుక్లాలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. ఈ సమస్య ఉంటే కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం, అస్పష్టమైన దృష్టి , ఒక వస్తువు రెండుగా కన్పించడం, కంటిలో తెల్లగా కనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
*అయితే ఈ సమస్య స్మోకింగ్ చేయనివారితో పోలిస్తే ధూమపానం చేసేవారిలోనే కంటి శుక్లాలు వచ్చే అవకాశం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట.
*అంతే కాకుండా కాంట్రాస్ట్ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుందట. దీనివల్ల రాత్రిపూట చూపు సరిగా ఉండదట. కాబట్టి స్మోకింగ్‌కు దూరంగా ఉంటే కంటిశుక్లం అనే సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
*కాబట్టి ఇకమీదట నైనా స్మోకింగ్ స్మోకింగ్ అలవాటుని మానుకోవడం మంచిది. మరి ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు లేని వారు.. పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే వీలైనంత దూరంగా వెళ్లిపోవడం మంచిది. ఆ పొగ పీల్చడం అన్నది తాగడంతో సమానమే అంటున్నారు వైద్యులు.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.