- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- వీడియోలు
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తస్మాత్ జాగ్రత్త! కాళ్లు.. చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే ఆ లోపమే కావచ్చు..!
దిశ,ఫీచర్స్: సాధారణంగా కండరాలలో రక్తప్రసరణ జరగకుండా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మనకి కాళ్లు చేతులు వంటివి తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం లేచి అటు ఇటు నడిస్తే సరిపోతుందని మనం నడుస్తూ ఉంటాము. కానీ ఇది ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే అంటూ పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి తిమ్మిర్లు దాదాపు ప్రతి 10 మందిలో 6 మందికి వస్తూ ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. కొంతమందికి నిద్రిస్తున్న సమయంలో మరి కొంతమందికి ఒకే దగ్గర చాలా సేపు కూర్చున్నప్పుడు ఇలా ఏదో ఒక పరిస్థితుల్లో వస్తుందని తెలుపుతున్నారు.
అయితే రాత్రి సమయాల్లో ఇలాంటి తిమ్మిర్లు వస్తే కచ్చితంగా అందుకు కారణం విటమిన్ B12 లోపమేనట.. ఈ లోపం ఎక్కువగా పెరిగితే కాళ్ల నొప్పులు వస్తాయని తెలుపుతున్నారు వైద్యులు. బి12 విటమిన్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా అంట. ఇది మన శరీరంలో సాధారణంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. దీని లోపం తలెత్తినప్పుడు మోకాలు కూడా తరచూ నొప్పి వస్తూ ఉంటాయి. ఒకవేళ బి12 విటమిన్ లోపించినట్లు అయితే రుచి వాసన వంటివి కోల్పోతారు. అలాగే రాబోయే రోజుల్లో జ్ఞాపకశక్తి కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:
*రోజుకు రెండు గ్రాముల చొప్పున బి12 పోషకాలు తీసుకోవడం వల్ల శరీరం క్రమంగా బలపడుతుంది. విటమిన్ బి12 పుష్కలంగా మాంసాహారంలో ముఖ్యంగా మేక, గొర్రెలలో ఎక్కువ శాతం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
*అలాగే చేపలు గుడ్లు కూడా పుష్కలంగా తిన్న అందులో కూడా ఉంటుంది..
* ఒకవేళ శాకాహారులు అయితే ఆకుకూరలు పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల కూడా ఈ లోపం నుంచి బయటపడవచ్చు..
*ఏదైనా పులియబెట్టిన మజ్జిగ తాగడం వల్ల కూడా ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
*పిస్తా బాదం తో పాటు పాలు పెరుగు వంటివి, ముఖ్యంగా నీటిలో ఎక్కువగా ఈ విటమిన్ ఉంటుంది అందుకే తరచూ ఎక్కువ నీటిని తాగడం వల్ల వీటిని అధిగమించవచ్చు.