ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? కచ్చితంగా ఫాలో కావాల్సిందే...

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-19 15:54:08.0  )
ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? కచ్చితంగా ఫాలో కావాల్సిందే...
X

దిశ, ఫీచర్స్ : ఈ కాలంలో ఉదయాన్నే నిద్ర లేవడం అనేది కష్టం. చాలా తక్కువ మంది ఈ పద్ధతి ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా హెల్త్ అండ్ ఫిట్ నెస్ పై కాన్సంట్రేట్ చేసేవారు మాత్రమే మార్నింగ్ వేక్ అప్ హ్యాబిట్ కలిగి ఉండగా.. మిగతా వారు లేజీనెస్ తో మధ్యాహ్నం వరకు పడుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కోల్పోతున్నారని చెప్తున్నారు నిపుణులు. అవేంటో కూడా వివరిస్తున్నారు.

ఆరోగ్యకరమైన అల్పాహారం

మీరు ముందుగానే లేస్తే పోషకాలు నిండుగా ఉండే అల్పాహారంతో మీ రోజు ప్రారంభించవచ్చు. లేట్ గా లేచి బ్రెడ్, వెన్నెతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేసే బదులు... ముందుగా లేచి న్యూట్రీషన్లు కలిగిన టిఫిన్ చేయడం మంచిది. దీనివల్ల రోజంతా సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంటారు.

వ్యాయామం కోసం సమయం ( Regular exercise )

త్వరగా లేవడం వల్ల ప్రశాంతంగా పని పూర్తి చేసుకునేందుకు సమయం లభిస్తుంది. రెగ్యులర్ గా మార్నింగ్ ఎక్సర్ సైజ్ చేసుకునే టైం దొరుకుతుంది. దీనివల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆందోళనను తగ్గిస్తుంది. ఆ రోజు మరింత చురుకుగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.

విటమిన్ డి పెరుగుదల ( Vitamin D)

ఉదయాన్నే లేచేవారు ఉదయపు సూర్య కిరణాల లాభాన్ని పొందవచ్చు. ఇది విటమిన్ డి సహజ మూలం. కాగా ఎముకల ఆరోగ్యం, మెంటల్ హెల్త్, రోగనిరోధక శక్తి పెరుగుదలకు శరీరానికి చాలా అవసరం.

ఉత్పాదకత మెరుగు ( Increase productivity )

త్వరగా లేచినప్పుడు.. రోజు ఎలా గడవాలో, ఏ పనికి ఏ టైమ్ కేటాయించాలి అనేది ప్లాన్ చేసుకునేందుకు అదనపు సమయం ఉంటుంది. ఈ ప్రణాళిక దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. టాస్క్ లకు టైం ఇస్తూ అన్ని పూర్తయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. మొత్తానికి ప్రొడక్టివిటీ అద్భుతంగా ఉంటుంది.

మూడ్ బూస్ట్

ఎర్లీ రైజర్స్ తరుచుగా మెరుగైన మానసిక ఆరోగ్యం, ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. రోజును ప్రశాంతంగా ప్రారంభించడం, తొందరపడే ఛాన్స్ లేదు కాబట్టి ఒత్తిడి ఉండదు. కాబట్టి రోజంతా సానుకూలంగా ఉండే దినచర్య ఏర్పాటు చేసుకోవడం సులభతరం చేస్తుంది.

ఆరోగ్యకరమైన చర్మం

త్వరగా లేవడం సాధారణ నిద్ర దినచర్యకు మద్దతిస్తుంది. ఇది చర్మాన్ని రిపేర్ చేయడంలో కీలకంగా ఉంటుంది. గాఢ నిద్రలో మీ శరీరం కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. మీ చర్మాన్ని దృఢంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి ఎర్లీ బెడ్, ఎర్లీ వేకప్ మీ చర్మాన్ని అద్భుతంగా మార్చగలదు. డార్క్ సర్కిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలదు.

నోట్... ఈ కంటెంట్ ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది.

Read More..

Health Tips: వ్యాయామం చేసిన వెంటనే ఆ పని అస్సలు చెయ్యొద్దు..! ఏం జరుగుతుందంటే..

Advertisement

Next Story