- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

దిశ, వెబ్‌డెస్క్ : ఆషాడ మాసం మొదలైంది. ఇక ప్రతీ ఆడపిల్లల చేతులు ఇప్పటి నుంచి గోరింటాకుతో అందంగా మెరిసిపోతాయి. చాలా మందికి గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది. ఇక ఈ మాసంలో పెట్టుకోవడం మరింత ఇష్టం. ఎందుకంటే మగువ అందాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇంతే కాదండోయ్.. పెళ్లి కాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలను అద్దడానికి ఈ ఆషాడం వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే గోరింటాకు పండడాన్ని బట్టి, కాబోయే భర్త గుణగణాలు చెబుతారు పెద్దవాళ్లు. కాస్తా ఎక్కువగా పండితే చాలు నీకు మంచి భర్త వస్తాడు.. నిన్ను బాగా చూసుకుంటాడు అంటూ ఆకాశానికెత్తేస్తారు. ఇక ఆ గోరింటాకు చేతులను చూసుకుంటూ యువతి ఆనందంతో మురిసిపోతుంది. అలాగే కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. ఈ సమయంలో వీరు తమ రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరింటాకు వారి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది అంటారు.
అందానికే కాదండోయ్.. ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిఫుణుులు. జ్యేష్ఠ మాసంలో వర్షాలు కురవడం మొదలై ఆషాడ మాసానికి ఊపందుకుంటాయి. దీంతో ఈ వర్షంలో తడుస్తూ మహిళలు పనులు చేస్తుంటారు. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు రావడం మొదలవుతాయి. అయితే వీటిని నుంచి రక్షణ పొందడానికి, గోరింటాకు ఉపయోగ పడుతుంది, ఇక ఈ మాసంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పోతూ ఉంటుంది. గ్రీష్మరుతువు తో వేడి గా మారిన మన శరీరం.. వర్ష ఋతువు ప్రారంభం అయినప్పటికీ కూడా అదే వేడితో ఉంటుందట. ఈ క్రమంలోనే ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరం వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో ఉపయోగ పడుతుందంటున్నారు.