- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
29 ఏళ్లలో పెరిగిన పురుషాంగం పరిమాణం.. కానీ.. ఎలా?
దిశ, ఫీచర్స్: సొసైటీలో ఇమేజ్ మార్చగలిగే, అపహాస్యం చేసే 'పెనిస్ సైజ్' పురుషులకు ఎప్పటికీ ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే పురుషాంగం పరిమాణం పెద్దగా ఉంటే గొప్పగా ఫీలవుతారు. చిన్నదైతే సిగ్గుపడతారు. పురుషత్వానికి కొలమానంగా మారిన ఈ విషపూరిత ప్రమాణాలు.. ఇప్పటికీ సమాజంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత 29 ఏళ్లలో సగటు పురుషాంగం పరిమాణం దాదాపు 24% పెరిగిందని తెలిపింది తాజా అధ్యయనం. ఇందుకోసం 1942 నుంచి 2021 వరకు ట్రెండ్‌లపై దృష్టి సారించిన అధ్యయనం... 56,000 మంది పురుషులపై చేసిన 75 వేర్వేరు అధ్యయనాలు సేకరించిన డేటాను విశ్లేషించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఇంటర్నెట్, మేల్ కమ్యూనిటీ ఈ వార్తపై సంతోషిస్తున్నప్పటికీ.. శాస్త్రవేత్తలు సంభావ్య పరిణామాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగటు పురుషాంగం పరిమాణం 24% పెరిగిందని ఎలా నిర్ధారించారని అధ్యయన రచయితలను ప్రశ్నిస్తున్నారు నిపుణులు. స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్‌లో ప్రధాన రచయిత, యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్. మైఖేల్ ఐసెన్‌బర్గ్.. దశాబ్దాలుగా పురుషుల లైంగిక ఆరోగ్యం క్షీణతకు అనుగుణంగా పరిమాణం తగ్గుతుందని వైద్యులు అంచనా వేస్తున్నట్టు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
గత దశాబ్దాలుగా పర్యావరణ పీడనం, జీవనశైలిలో మార్పులు, రసాయనాలు, పురుగు మందులకు ఎక్కువగా గురికావడం పురుషుల లైంగిక, హార్మోన్ల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమైంది. కానీ ఈ అధ్యయనం విరుద్ధమైన ఫలితాన్ని చూపుతుందన్నారు. దశాబ్దాలుగా స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి క్షీణించగా.. పురుషాంగం పరిమాణం మాత్రం ఎలా పెరిగిందని ప్రశ్నిస్తున్నారు.