PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆసనాలు ట్రై చేస్తే ఆ ప్రాబ్లమ్ ఇట్టే మాయం..

by Kavitha |
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆసనాలు ట్రై చేస్తే ఆ ప్రాబ్లమ్ ఇట్టే మాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పీసీఓడీ(PCOD) సమస్యతో బాధపడుతున్నారు. అసలు పీసీఓడీ అంటే ఏమిటంటే.. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్. ఇది ఒక హార్మోన్‌కు సంబంధించిన సమస్యగా చెప్పొచ్చు. అయితే ఈ సమస్య ఉంటే పీరియడ్స్ అనేది సక్రమంగా రాదు. అలాగే బరువు పెరగడం, అప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్ మారిపోతూ.. చిరాకు, విసుగు లాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్ అనేది అంత ఈజీగా తగ్గేది కాదు. ఇక మీరు ఈ సమస్యను తగ్గించుకోవాలంటే వైద్యుల సలహాలతో పాటు ఈ ఐదు ఆసనాలు తప్పక వేయాలని అంటున్నారు వైద్య నిపుణులు. వీటిని వేశారంటే ఈ సమస్యల నుండి మీరు ఈజీగా బయటపడవచ్చట. మరి ఇంతకీ ఆ ఆసనాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1) శవాసనం : మీరు శవాసనం వేయడం వలన పీసీఓడీ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు అని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ సమస్య వల్ల మనస్సు పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందట. కాబట్టి శవాసనం వేయడం వలన ఒత్తిడి దూరం అయి ప్రశాంతంగా ఉంటారట. అదేవిధంగా ఈ ఆసనం వల్ల హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయట.

2) బాలాసనం : ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు తొందరగా ఉపశమనం పొందాలంటే తరచుగా బాలాసనం వేయాలని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక మీరు ఈ ఆసనం వేయడం వలన హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయట. అలాగే చిరాకు, విసుగు, ఆందోళన లాంటివి కూడా తగ్గుతాయట.

3) త్రికోణాసనం: ఈ ఆసనం వేయడం వలన కూడా మీరు ఈ సమస్యను నియంత్రించవచ్చట. దీని వల్ల పెల్విక్ ఏరియాలో వచ్చేటటువంటి నొప్పులు తగ్గుతాయట. అలాగే ఈ ఆసనం వలన కొంత ఎనర్జీ అనేది మీకు లభిస్తుందట. అంతేకాకుండా త్వరగా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుందట. అందుకే ఈ ఆసనాలు చేస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story

Most Viewed