Diabetic Care : మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా..? లంచ్ టైమ్‌లో ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!

by Javid Pasha |
Diabetic Care : మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా..? లంచ్ టైమ్‌లో ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!
X

దిశ, ఫీచర్స్ : మధుమేహం.. ఒకప్పుడిది 50 ఏండ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం వంటివి ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే షుగర్ బాధితులు తరచుగా రక్తంలో చక్కెరస్థాయిలు హెచ్చు తగ్గులకు గురికావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లంచ్ టైమ్‌లో చేయకూడని మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

*స్వీట్లు వద్దు : కొందరు భోజనం తర్వాత స్వీట్లు తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే మధుమేహం ఉన్నప్పుడు ఇలా చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి తినకపోవడం మంచిది.

* వేయించిన ఆహారాలు : షుగర్ పేషెంట్లు మధ్యాహ్న భోజనం తర్వాత వేయించిన ఆహార పదార్థాలు తినడం కూడా మంచిది కాదు. వీటిలో ఉప్పు, నూనె అధికంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి హానికరం. అందుకు బదులు ఫైబర్ కంటెంట్ ఉన్న ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ తినడం మంచిది.

* కూల్ డ్రింక్స్ : లంచ్ తర్వాత డయాబెటిక్ పేషెంట్లు కూల్ డ్రింక్స్ తాగడం కూడా మంచిది కాదు. వీటిలో కృత్రిమ స్వీటెనర్లు అధికంగా ఉంటాయి. కాబట్టి చక్కెరస్థాయిలు పెరగడానికి కారణం అవుతాయి.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించడం లేదు. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story