- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
the beauty : ఏది అసలైన అందం..?

దిశ, ఫీచర్స్
అందమే ఆనందం అంటారు కొందరు..
అదో మధురానూభూతి అంటారు మరికొందరు..
ఆకట్టుకునేదని కొందరంటే..
ఆలోచించే విధానమని మరికొందరంటారు..
ఇంతకీ ఏంటి భయ్యా అందమంటే..
చూడ చక్కని రూపమా?
మనసులోని భావమా?
యూత్ ఏమనుకుంటున్నది?
బ్యూటీ స్టాండర్స్ అండ్ కాన్సెప్టేషన్స్ అనేవి దశాబ్దాల కాలంగా మానవుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలుగానే ఉంటున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ ఎక్కువగా పితృస్వామ్య నైతికత లేదా భావజాలం ఆధారంగా నొక్కి చెప్పబడిన మూస ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడుతూ వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత వ్యాపార ప్రయోజనాలు వాటిని ఆక్రమించాయి. ప్రస్తుతం నడస్తున్న హవా ఇదే. ఫ్యాషన్ షోలు, క్యాట్ వాక్‌లు, ర్యాంప్ వాక్‌లు, అందాల పోటీలు అందుకు చక్కటి నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇంతకీ జెన్‌జీలు(Gen Z) ఏమనుకుంటున్నారు?
నిజం చెప్పాలంటే.. మెజారిటీ ప్రజల్లో, యువతలో వారి సొంత ఆలోచనలతో సంబంధం లేకుండానే అందం అనే పదానికి నిర్వచనాలు, భావనలు, నిర్ణయించబడుతూ ప్రచారంలో ఉంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార లేదా మార్కెట్ ప్రయోజనాల ఆధారంగా ఈ కాన్పెప్టేషన్స్ పాతుకుపోతున్నాయని సామాజిక వేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిని యువత అర్థం చేసుకుంటూ మార్పువైపు అడులు వేస్తోందని అంటున్నారు. పలు అధ్యయనాలు సైతం అదే పేర్కొంటున్నాయి. 2023తో పోల్చితే 2024లో అందం యొక్క భావనలను అర్థం చేసుకునే విషయంలో డైనమిక్ మార్పు కనిపించిందని, 2025లోనూ అదే కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. Gen Z ఇప్పుడు నష్టం చేకూర్చే వాటిని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. బ్యూటీ కాన్సెప్ట్ విషయంలో మినిమలిజం, స్థిరత్వం, ఆరోగ్యం వంటి ఆలోచనలకు ప్రయారిటీ ఇస్తోందని నిపుణులు అంటున్నారు.
సెల్ఫ్‌ఎక్స్ ప్రెషన్
ఓ దశాబ్దం కిందట అయితే అందానికి సంబంధించి ఇతరులు ఆమోదించిన నిర్వచనానం లేదా సంస్కృతి, సంప్రదాయాల నిర్వచనాన్నే యూత్ అంగీకరించేది. కానీ ఆధునిక యువత అలా చేయడం లేదు. సొంత ఆలోచనలకు పదును పెడుతోంది. ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్ రూపంలో కృత్రిమ సమర్పణలను తిరస్కరిస్తున్నది. సెల్ఫ్‌ఎక్స్ ప్రెషన్, అట్లనే స్కినిమలిజం(ఆరోగ్యకరమైన స్కిన్ కేర్ ) మార్గంలో ప్రయాణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలంకరణలు, వస్త్ర ధారణలు మొదలు కొని.. బ్యూటీ ప్రొడక్ట్స్, వివిధ మాయిశ్చరైజర్స్‌పై నేటి యువతీ యువకులు సొంత అభిప్రాయాలను కలిగి ఉంటున్నారు. యూత్ అంటేనే.. దూకుడెక్కువ, సామాజిక స్పృహ తక్కువ అనే మాటకు కాలం చెల్లుతోంది. అందం, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలోనూ యువతలో పర్యావరణ స్పృహ పెరుగుతోంది. నత్త వ్యర్థాలు, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్స్ వంటి ప్రత్యేకమైన, ప్రకృతి సహజ సిద్ధమైన, పర్యావరణ అనుకూలమైన బ్యూటీ కాన్సెప్టేషన్స్ యువతతో పెరుగుతున్న సామాజిక బాధ్యతకు నిదర్శనమని కూడా నిపుణులు అంటున్నారు.
వాస్తవాలే ప్రామాణికం
అందం, అలంకరణ, వస్త్రధారణ, ఫిట్‌నెస్ వంటి విషయాల్లో నేటి యువత భ్రమలను వీడుతోంది. వాస్తవ ఆలోచనలకు, ప్రమాణాలకు అనుగుణంగా అందాన్ని నిర్వచించుకుంటోంది తప్ప ఇతరులు చెప్పిందే కరెక్ట్ అనేక ధోరణికి తలొగ్గడం లేదని నిపుణులు చెబుతున్నారు. రకరకాల కెమికల్స్, ప్లాస్టిక్స్, వివిధ హానికరమైన రసాయనాలతో తయారవుతున్న ప్రొడక్ట్స్‌ను వ్యతిరేకిస్తున్న యువతరం పెరుగుతోంది. విదేశాల్లో ఇప్పటికే ఈ పరిస్థితి ఉండగా.. ఇండియాలోనూ విస్తరిస్తోంది. ఓ కంపెనీకి చెందిన ఫెయిర్ క్రీమును ప్రముఖ యువ సినీ నటి సాయిపల్లవి ప్రమోట్ చేయకపోవడం ఆ మధ్య కాంలో యువతను బాగా ఆలోచింపజేసింది. Gen Zలో దాదాపు 60% మంది పర్యావరణ అనుకూల బ్రాండ్‌లను మాత్రమే కొనుగోలు చేస్తున్నది. 2023 నాటి గ్లోబల్ కన్జ్యూమర్ సర్వే ప్రకారం కూడా యువత దాదాపు 40 శాతం మంది నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఇష్టపడుతున్నారు. మారుతున్న యువత ఆలోచనలకు, పర్యావరణ స్పృహకు ఇదే చక్కటి నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఓవరాల్‌గా చూస్తే ఆధునిక పాప్ కౌంటర్ కల్చర్‌ను గానీ, అలాగే పూర్తి మూస ధోరణితో కూడిన బ్యూటీ కల్చర్‌ను గానీ ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేయడం లేదు.