- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలర్ట్: బిర్యాని తిన్న వెంటనే కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలామంది బిర్యాని తిన్న తర్వాత అది అరగడం కోసం కూల్‌డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే అలా తాగితే చాలా ప్రమాదాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి బిర్యాని తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
1) చెక్కర స్థాయిలు పెరగడం:
కూల్‌డ్రింక్స్‌లో అధిక స్థాయిలో ఉన్న చక్కర.. రక్తంలో షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచుతుంది. బిర్యానిలో ఇప్పటికే ఉన్న కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఈ ప్రభావాన్ని మరింత పెంచి, శరీరంలో అనవసర చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా షుగర్ ఉన్న వారికి అలాగే చక్కెర నియంత్రణ సమస్యతో బాధపడుతున్న వారికి హానికరం.
2) జీర్ణ సమస్యలు:
బిర్యానీ సహజంగా హెవీ ఫుడ్. ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. కూల్‌డ్రింక్‌లోని కార్బనేషన్ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గ్యాస్ ఏర్పడటానికి కారణమవుతుంది. ఫిజి పానియాలు పేగుల్లో గ్యాస్‌ను ఏర్పరచి, అజీర్ణం, పొట్ట నొప్పి, ఉబ్బరం(బ్లోటింగ్) వంటి సమస్యలను పెంచుతాయి.
3) ఆమ్లత్వం పెరగడం:
కూల్‌డ్రింక్‌లు ఎక్కువగా ఫాస్పోరిక్ యాసిడ్ వంటి పదార్థాలతో కూడి ఉంటాయి. బిర్యాని తిన్న తర్వాత పేగుల్లో సహజంగా ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్‌కి తోడు కూల్‌డ్రింక్స్ లోని యాసీడ్స్ జీర్ణ వ్యవస్థలో గల ఆమ్లాన్ని పెంచుతాయి. దీనివల్ల గ్యాస్, హార్ట్ బర్న్(గుండెలో మంట) వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
4) కిడ్నీ కాలేయంపై ప్రభావం:
కూల్ డ్రింక్‌లోని అధిక చక్కెరలు, ప్రిజర్వేటివ్స్ కాలేయం, కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతాయి. బిర్యానీలో ఉన్న ప్రొటీన్లు, కొవ్వులు ఇప్పటికే శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఇక కూల్ డ్రింకులతో పాటు తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్‌లు ఎక్కువ అవుతాయి. దీంతో ఇది కాలేయం, కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
5. ఒబేసిటీ, గుండె సమస్యలు:
కూల్ డ్రింక్‌లోని అధిక స్థాయిలో చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరుగుదలకి కారణమవుతాయి. బిర్యానీ సహజంగానే హై క్యాలరీ ఆహారం. దీని కారణంగా ఒబేసిటీ, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని తరచూ తీసుకోవడం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారితీస్తుంది.
6. శక్తి తగ్గడం:
కూల్ డ్రింకులు ఎక్కువగా తాగడం వలన మధుమేహం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్షణమే పెరిగి, తర్వాత త్వరగా తగ్గిపోతాయి. ఇది శరీరంలో ఉత్సాహాన్ని తగ్గిస్తుంది, చలాకీగా ఉండే శక్తిని కోల్పోవటానికి కారణం అవుతుంది. బిర్యానీ లాంటి రుచికరమైన ఆహారం తిన్నప్పుడు వెంటనే కూల్‌డ్రింక్స్‌లు తాగడం వల్ల ఈ ఫలితాలు సంభవిస్తాయి.
7) మూత్ర పిండాలకు ముప్పు:
బిర్యానితో పాటు కూల్‌డ్రింక్ తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై విషపదార్థాలు పేరుకుపోతాయి. కూల్‌డ్రింక్‌లు కిడ్నీలపై డిటాక్సిఫికేషన్ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. దీంతో దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి బిర్యాని తిన్న వెంటనే కూల్‌డ్రింక్స్ తాగకండి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.