విజయవంతంగా గుండె ఆపరేషన్ పూర్తి చేసిన AI.. ఎక్కడ, ఎలా జరిగిందనే ఫుల్ డిటైల్స్

by Sujitha Rachapalli |   ( Updated:2024-09-19 15:53:40.0  )
విజయవంతంగా గుండె ఆపరేషన్ పూర్తి చేసిన AI..  ఎక్కడ, ఎలా జరిగిందనే ఫుల్ డిటైల్స్
X

దిశ, ఫీచర్స్ : సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI గుండె మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. కార్డియాక్ సర్జరీలో అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మార్గదర్శక ప్రక్రియ రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (KFSHRC)లో జరగ్గా.. ఎండ్-స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న 16 ఏళ్ల వయస్సున్న బాలుడికి సర్జరీ చేసినట్లు సమాచారం. ఇందుకు సుమారు రెండు గంటల యాభై నిమిషాల సమయం పట్టగా.. మినిమల్లీ ఇన్వాసివ్ రోబోటిక్ సర్జరీని ఇన్నోవేటివ్ అప్రోచ్ గా ప్రశంసిస్తున్నారు విశ్లేషకులు.

మొత్తానికి ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తి రోబోటిక్ గుండె మార్పిడి రికార్డు క్రియేట్ చేసిన సౌదీ అరేబియా.. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో నాయకత్వాన్ని బలపరుస్తుంది. వైద్య విధానాలను అభివృద్ధి చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, రోగుల సంరక్షణను మెరుగుపరచడంలో ఆ దేశం నిబద్ధతగా ఉందనడానికి ఈ అద్భుతమైన విజయం ఉదాహరణ.


Read More..

MD Sajjanar : మరణించిన తర్వాత జీవించడం! టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్


Advertisement

Next Story

Most Viewed