ఆ హీరోలే యువకుల ఎముకలు విరగ్గొడుతుంది??

by Sujitha Rachapalli |   ( Updated:2025-02-20 14:13:50.0  )
ఆ హీరోలే యువకుల ఎముకలు విరగ్గొడుతుంది??
X

దిశ, ఫీచర్స్: శీతల పానీయాలు మన ఇళ్లలో కనిపిస్తూనే ఉంటాయి. ఫ్రిడ్జిలో స్టోర్ చేసుకుని మరీ రోజుకో సిప్ అయినా వేస్తాం. అలా ఒక శాటిస్‌ఫాక్షన్ పొందుతాం. కానీ ఇలాంటి పానియాలు తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతున్నాయి. యువకుల్లో స్ట్రాంగ్‌గా ఉండాల్సిన బోన్స్.. వీక్‌గా మారిపోతున్నాయి. అయితే ఇలా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేందుకు కారణం మన హీరోలే కారణమని తేల్చింది తాజా అధ్యయనం. అవును.. ఫేవరేట్ స్టార్స్ యాడ్స్ చూసి వారిని ఫాలో అవుతున్నారని ఆ ప్రొడక్ట్స్ తరుచుగా కొంటున్నారని వివరించింది.

తాగితే మామూలు ఎనర్జీ రాదు అన్నట్లుగా ఉంటాయి ఈ కూల్ డ్రింక్స్ కంపెనీల ప్రొడక్ట్స్. ముఖ్యంగా సమ్మర్‌లో యాడ్స్ మరీ ఎక్కువైపోతాయి. ఎండకు చెమట పట్టేసిందా వెంటనే మా కూల్ డ్రింక్ కొనండి అని ఓ స్టార్‌తో యాడ్ ప్రిపేర్ చేసి జనాల మీదకు వదిలేస్తారు. కానీ ఎనర్జీ రావడం పక్కన పెడితే ఉన్న ఆరోగ్యం పోతుంది. ఎందుకంటే ఇందులో ఉండే కెమికల్స్ ముఖ్యంగా వీటిలోని షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇందులో వినియోగించే షుగర్.. ఐదు నుంచి పది స్వీట్లు తీసుకోవడంతో సమానమని హెచ్చరిస్తున్నారు. వైన్, రమ్ము పుచ్చుకునే వారి కన్నా కూడా దీనిని సేవించే వారు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారని తెలిపారు.

మరిన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ :

* శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల దంత క్షయానికి దోహదం చేస్తుంది. కార్బోనేటేడ్ వాటర్ సాధారణ స్టిల్ వాటర్ కంటే తక్కువ pH కలిగి ఉంటుంది.దంతాల ఎనామెల్‌ను క్షీణింపజేస్తుంది. నరాలను రక్షించే ఎనామెల్ కింద ఉన్న ప్రాంతం అయిన డెంటిన్ కోతకు గురయ్యే అవకాశం ఉంది.

* కార్బోనేటేడ్ డ్రింక్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి. ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తాయి. జీర్ణ ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

* కూల్ డ్రింక్స్ తాగినప్పుడు సాధారణం కన్నా ఎక్కువ గాలిని మింగుతాం. ఇది బ్లోటింగ్‌‌కు కారణమవుతుంది. అసౌకర్యంగా ఉంటుంది.

Read More : వచ్చేస్తోన్న వేసవికాలం.. తినాల్సిన పండ్లు ఇవే..?

Next Story

Most Viewed