LIVER FUNCTION : సోషల్ మీడియాలో చెప్పేవన్నీ ఫాలో అయితే.. లివర్ ఖరాబ్ అవడం ఖాయం...

by Sujitha Rachapalli |
LIVER FUNCTION : సోషల్ మీడియాలో చెప్పేవన్నీ ఫాలో అయితే..  లివర్ ఖరాబ్ అవడం ఖాయం...
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్స్ తమకు నచ్చింది చేస్తుంటారు. సైంటిఫిక్ గా ప్రూవ్ కానీ హెల్త్ టిప్స్ కూడా అందిస్తుంటారు కొందరు. కానీ దీనివల్ల భారీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వారు చెప్పే కషాయం, పసరు లాంటివి తాగి హెల్త్ పాడు చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

  • ఆకులు తెంపి, మిక్సీ చేసి.. పసరు తయారు చేసుకుని తాగడం లాంటివి అసలు చేయకూడని తెలుపుతున్నారు. ఇది టైమ్ వేస్ట్ తోపాటు ఇలా చేస్తే ఆకులపై ఉన్న సూక్ష్మక్రిముల ద్వారా అమీబియాసిస్ లాంటివి వచ్చి లివర్ చెడిపోతుందన్నారు. నులిపాములు కూడా పేగుల్లో పేరుకుపోతాయని చెప్తున్నారు.
  • ఇన్నాళ్లు మద్యం తాగడం వల్ల అది కొవ్వుగా మారి లివర్ పై ఎఫెక్ట్ చూపుతుంది అనుకునేవారు. కానీ తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కణాలను డ్యామేజ్ చేస్తున్నాయి. అవి మానకుండా.. కొత్తవి పుట్టకుండా అడ్డుకుంటున్నాయి. వాటి స్థానంలో ఫైబ్రోసిస్ ఏర్పరిచి లివర్ ను గట్టిగా చేసి, సైజ్ తగ్గించేస్తుంది. చివరకు పనికిరాని కాలేయంగా మారుస్తుంది.
  • ఆల్కహాల్ తర్వాత లివర్ కు అంత డ్యామేజ్ కలిగించేవి హెపటైటిస్ వైరస్ మాత్రమే. ఇవి కలుషిత నీరు, వాడి పడేసిన ఇంజెక్షన్లు, అసురక్షిత శృంగారం వల్ల వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. కాచి వడపోసిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.
  • స్వీట్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, నిల్వ చేసిన పచ్చళ్ళు తీసుకోవడం ద్వారా కూడా లివర్ పాడైపోతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫీషియల్ కలర్స్ కలిపి వేయించిన చికెన్ పకోడీ, షర్బత్ లాంటివి బయట తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ మానేసి రోజు వ్యాయామం చేయడం ద్వారా కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయని చెప్తున్నారు.
  • అన్ని రకాల మందులను కాలేయమే నిర్వీర్యం చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. కాబట్టి దానికి వీలైనంత భారం తగ్గిస్తే మంచిదని అంటున్నారు నిపుణులు. వైద్యుల సిఫారసు లేకుండా అనవసర సప్లిమెంట్లు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్, విటమిన్లు వాడడం అస్సలు మంచిది కాదని అంటున్నారు

నోట్ : పై సమాచారం నిపుణులు సూచనల మేరకు తీసుకోబడింది..

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed