- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్ వైఫ్ సిండ్రోమ్.. ప్రతి ఇల్లాలు చదవాల్సిన కథ..

దిశ, ఫీచర్స్ : గుడ్ వైఫ్ సిండ్రోమ్ గురించి విన్నారా? ఇంత వరకు హెడ్ లైన్స్ టచ్ చేయని.. చాలా ఇండియన్ ఇళ్లలో జరిగే నిశ్శబ్ద సంఘర్షణ. కనిపించని లోతైన గాయాలను దాచుకునే స్త్రీ జీవితం. ప్రేమ, ఆనందానికి నోచుకోని.. విధిరాతకు తలొగ్గే భార్య భావోద్వేగం. ఇంతకీ ఈ మంచి భార్య సిండ్రోమ్ ఉన్న మహిళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? భర్తను ఎలా ట్రీట్ చేస్తుంది? కుటుంబానికి ఎలాంటి సపోర్ట్ చేస్తుంది?
త్యాగాలతో మొదలు
చిన్న చిన్న విషయాల్లో ప్రేమ పేరుతో సర్దుబాటు మొదలవుతుంది. ఆమె చెప్పిన విషయాల గురించి భర్త మరిచిపోవడం, తనను సంతోషపెట్టే ప్రయత్నం లేకపోవడం లాంటివి బిజీగా ఉన్నాడనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటుంది. పురుషులు ఇలాగే ఉంటారని తనకు తాను సర్దిచెప్పుకుంటుంది. ఒకవేళ తను నిర్లక్ష్యంగా ఉంటున్నానేమోననే ఫీలింగ్‌తో బాధపడుతుంది. ప్రతి విషయంలో తగ్గుతూనే.. భర్తతో ఎక్కువ డిమాండింగ్‌గా ఉండకూడదని, అధికంగా ఆధారపడొద్దని చెప్పుకుంటుంది. సహనం పట్ల గర్వపడుతుంది. దాన్ని బలంగా నమ్ముతుంది. కానీ ఆమె గ్రహించని విషయం తన స్థానం పడిపోతుందని...
నిశ్శబ్ద బరువు
ఈ సిండ్రోమ్ ఉన్న స్త్రీలు బలహీనులు కాదు బలవంతులే. అసమతుల్య సంబంధ బరువును మోయగలమని నమ్ముతారు. కుటుంబం చెక్కు చెదరకుండా ఉండటమే తమ కర్తవ్యంగా భావిస్తారు. తమ అవసరాల గురించి పూర్తిగా మరిచిపోయి.. నిశ్శబ్దంలో బాధను మోస్తారు. తమకు ఈ జీవితమే కరెక్ట్ అనుకుంటారు.. కానీ అసలు తెలియనిది ఏంటంటే పని చేయడానికి తప్ప నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించబడరు.
ఆ ఊహ కూడా భరించలేరు
ప్రేమ, ఓపిక కేవలం అమ్మాయికే కాదు కదా. అబ్బాయికి కూడా ఉండాలి. పెళ్లి అనే బంధంలో మానసిక మద్దతు కచ్చితంగా ఇవ్వాలి. కనీస సపోర్టు కోరుకోవడం స్వార్థం కాదు. అది అందనప్పుడు ఆ రిలేషన్‌ను ముగించడం వైఫల్యమూ కాదు. కానీ చాలా మంది మహిళలు అలా చేయలేరు. భర్తను విడిచిపెట్టి లైఫ్ ఎలా కొనసాగిస్తామనే భయంతో అక్కడే ఉండిపోతారు. అసలు ఆ ఊహ కరెక్ట్ కాదని.. భర్తనే జీవిత పరమార్థంగా భావిస్తారు.
ఫైనల్‌గా గుడ్ వైఫ్ సిండ్రోమ్‌కు విరుగుడు తిరుబాటు చేయడమో.. సంబంధాలను విస్మరించడమో కాదు.. ప్రేమ అనే బాధ్యత ఇరువైపులా ఉండాలని అర్థం చేసుకోవడం. మంచి భార్యగా ఉండేందుకు.. సంతోషం, సంతృప్తిగా ఉండే హక్కును వదులుకోవాల్సిన అవసరం లేదు. సొంత ఆనందాన్ని కోరుకోవడంలో అసలు తప్పే లేదు. మీ వివాహబంధం గొప్పదే అయితే.. మిమ్మల్ని ఇంతగా మార్చేయదు కూడా. ఓసారి ఆలోచించండి..