- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
'మిలియనీర్ అవ్వండి, బిలియనీర్‌ని పెళ్లి చేసుకోండి' పుట్టబోయే బిడ్డకు ఓ మహిళ విచిత్రమైన షరతు..
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ధనవంతులు డబ్బు ఖర్చు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కానీ పేదవారు మాత్రం రోజుకు రెండు పూటల అన్నం కోసం కష్టపడి పనిచేస్తారు. లేదా కూడా ఇంటింటికీ తిరుగుతూ అడుక్కుంటారు. అయితే వీరిలో కొంత మంది ఎంతో కష్టపడి అదృష్టం కలిసొచ్చి ధనవంతులుగా మారే వారు ఉన్నారు. అలాగే ఎలాంటి కష్టం చేయకుండానే కోటాను కోట్ల ఆస్తులకు యజమానులుగా మారి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారు మరికొందరు ఉన్నారు. దుబాయ్‌లో ఉంటూ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచేంత సంపదను చూపించిన అలాంటి ఓ మహిళ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
ఈ మహిళ పేరు సౌదీ అల్ నదక్. సౌదియా నిజానికి బ్రిటీష్ పౌరురాలు. కానీ జమాల్ అనే మిలియనీర్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఇప్పుడు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యింది. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ఆమె తాను అనుభవిస్తున్న విలాసవంతమౌన జీవితానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. భర్త డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఈ మహిళ.. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ విచిత్రమైన షరతు పెట్టింది. తనకు కూతురు పుడితే కోటీశ్వరుడైన అబ్బాయిని వెతుక్కోవాల్సిందేనని, ఎందుకంటే తాను కోటీశ్వరురాలిని అని స్పష్టంగా చెప్పింది.
భవిష్యత్ పిల్లల కోసం కఠినమైన నియమాలు..
ది సన్ నివేదిక ప్రకారం సౌదీలు తమలాంటి ధనవంతులైన మహిళలు మాత్రమే పిల్లలకు జన్మనివ్వాలని, తద్వారా పిల్లలు మంచి జీవితాన్ని గడపాలని, డబ్బు లేకపోతే పిల్లలు పుట్టకూడదని చెప్పారు. పుట్టబోయే బిడ్డ కోసం ఆమె విధించిన కఠినమైన నియమాలలో మొదటిది ఏమిటంటే, ఆడపిల్ల పుడితే, పెళ్లికి సంపన్నుడైన అబ్బాయిని వెతుక్కోమని, అబ్బాయి పుడితే వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలి అని. అలా చేస్తే ఆ పిల్లలు తన తండ్రిలాగే గొప్ప జీవితాన్ని గడపగలరని చెబుతంది.
సౌదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివిధ రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె తన ఖరీదైన బట్టలు, ఖరీదైన బ్యాగులు, ఉపకరణాలు, ఆభరణాలను చూపిస్తుంది. ఒక సామాన్య కుటుంబం తమ జీవితాంతం విలాసవంతంగా గడపగలిగే మొత్తాన్ని ఆమె ఒక్కరోజులో ఖర్చు చేస్తుందట.