Rain of fish : ఒక్కసారిగా కురిసిన చేపల వర్షం.. ఆనందంతో వాటిని ఏరుకోవడానికి క్యూ కట్టిన జనం (వీడియో)

by Dishafeatures2 |
Rain of fish : ఒక్కసారిగా కురిసిన చేపల వర్షం.. ఆనందంతో వాటిని ఏరుకోవడానికి క్యూ కట్టిన జనం (వీడియో)
X

దిశ, ఫీచర్స్ :అప్పటి వరకు నార్మల్‌గానే ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. చూస్తుండగానే ఉరుములు, మెరుపులు స్టార్ట్ అయ్యాయి. క్షణాల్లో వర్షం ధారాపాతంగా కురువసాగింది. వడగళ్లు కూడా పడుతున్నాయి. ఇలా పడటం సాధారణమే కానీ, అంతలోనే ప్రజలకు ఇక్కడో వింత అనుభవం ఎదురైంది. ఏంటంటే.. ఉన్నట్లుండి ఆకాశం నుంచి చేపల వర్షం కురవడం ప్రారంభమైంది. ఇది చూసిన ప్రజలంతా ఆశ్చర్యపోవడంతోపాటు ఆనందంతో కేరింతలు కొడుతూ వర్షంలో కురుస్తున్న చేపలను ఏరుకోవడంలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ చక్కర్లు కొడుతుండగా ఇంతకీ ఆ ప్రాంతం ఏది? చేపల వర్షం కురవడం ఏమిటి? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చేపల వర్షం కురిసింది మరెక్కడో కాదు, ఇరాన్ దేశంలో. భారీ తుఫానువల్ల కురిసిన వర్షంతో పాటు ఈ చేపలు కూడా పడ్డాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే చేపలు కురవడం దాదాపుగా జరగని పని కాబట్టి అదెలా సాధ్యం? అనే సందేహాలు వ్యక్తం అవుతుండగా, ఇది తీవ్రమైన గాలి, తుఫాను వర్షం ఒక్కసారిగా రావడం కారణంగా జరిగిందని నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హోరుగాలి ఒక్కసారిగా రావడంవల్ల అది సముద్రం నుంచి జలచరాలను పైకిలాగి వదిలేసి ఉంటుందని, దీంతో చేపలు వర్షంతోపాటు భూమిపై పడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది చూసిన ప్రజలు సహజంగానే చేపల వర్షం కురిసిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇరాన్ వాతావరణ నిపుణుల నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్లు చేయడంతో పాటు దానిని షేర్ చేస్తున్నారు.

Next Story