- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shocking Study : ప్లాస్టిక్ కంటైనర్లలో తింటున్నారా? మీ గుండె రిస్క్‌లో పడ్డట్టే!

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా? అయితే మీరు రిస్క్‌లో పడినట్టే. ఎందుకంటే.. ఇలా చేయడంవల్ల రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినవచ్చునని, గట్ బయోమ్‌లో మార్పులతో ఛాతీలో మంట, రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటివి సంభవించే చాన్స్ ఉందని ‘సైన్స్ డైరెక్ట్’ జర్నల్‌లో పబ్లిషైన ఓ అధ్యయనం పేర్కొన్నది. 300 మందిపై పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం వల్ల కలిగే నష్టాలేమిటో వెల్లడించారు.
* ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి వేడి ఆహారం ఉంచడంవల్ల అందులో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ వెలువడటం, అవి మనం తినే ఆహారంలో చేరి, తద్వారా పేగుల్లోకి ప్రవేశించడం ఇందుకు కారణం అవుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అవి గట్ లైనింగ్‌కు నష్టం కలిగించడమే కాకుండా డీహైడ్రేటింగ్‌కు దారితీస్తాయి. గుండె జబ్బుల రిస్కును పెంచుతాయని వెల్లడించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ కంటైనర్లలోని ఆహారంలో కలిసిపోయే హానికరమైన బ్యాక్టీరియా రక్తంలో ప్రవేశించడం ద్వారా పేగులను అనారోగ్యానికి గురిచేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. డీహైడ్రేటింగ్‌కు కారణవుతుంది. గుండె జబ్బుల రిస్కును పెంచుతుంది.
*అధ్యయనంలో భాగంగా పరిశోధకులు చైనాలో మూడు వేలమందిపై స్టడీ చేశారు. వారిలో ప్లాస్టిక్ టేకౌట్ కంటైనర్ల నుంచి తినే అలవాటు, అలాగే గతంలో గుండె జబ్బులు వంటివి ఉన్నాయా అనేది కూడా పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాత ప్లాస్టిక్ రసాయనాలు వెలువడేలా చేయగల వేడినీటిని క్యారీ అవుట్ కంటైనర్లలో పోసి, వాటిని ఎలుకలపై ప్రయోగించగా, నీటిలో ప్లాస్టిక్ రిలీజ్ అయ్యే హై ఫ్రీక్వెన్సీ గుండె ఆగిపోయే రిస్కును పెంచినట్లు గుర్తించారు.
*అట్లనే ప్లాస్టిక్ నుంచి ఏయే రసాయనాలు లీక్ అవుతున్నాయో చెప్పలేదు కానీ.. సాధారణ ప్లాస్టిక్ సమ్మేళనాలు, గుండె జబ్బుల మధ్య సంబంధాన్ని, గట్ బయోమ్, గుండె జబ్బుల మధ్య అంతకు ముందటి పరిశోధనను విశ్లేషించారు. కాగా ఆహారం నిల్వ చేసే ప్లాస్టిక్ కంటైనర్లలో మైక్రో ప్లాస్టిక్ విడుదల కావడంవల్ల అసలు సమస్య తలెత్తుతున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం ప్రమాదకరం కాబట్టి ఆహార పదార్థాల నిల్వకోసం, తినడం కోసం గ్లాస్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు ఎంచుకోవడం బెటర్ అంటున్నారు పరిశోధకులు. అట్లనే ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారం తినడం, స్టోర్ చేయడం ఇంకా డేంజర్. దీంతో మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలిసిపోతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.