- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ గ్రామంలో వింత ఆచారం.. కొత్త అల్లుడిని గాడిద పై ఊరేగిస్తారట..
దిశ, ఫీచర్స్ : భారతదేశంలో హోలీని వివిధ సంప్రదాయాలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హోలీని జరుపుకుంటున్నప్పటికీ సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అలాంటి ఒక విచిత్రమైన సంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విచిత్రమైన హోలీ సంప్రదాయం భారతదేశంలోని మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సుమారు 86 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం బీడ్ జిల్లాలోని కేజ్ తహసీల్‌లోని విదా గ్రామంలో నిర్వహిస్తారు. మరి ఆ సంప్రదాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లుడిని గాడిద పై కూర్చోబెట్టి ఊరేగించడం..
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గత 86 ఏళ్లుగా ఈ వింత ఆచారంతో హోలీ ఆడుతుంటారు. ఇక్కడ హోలీ రోజున ఇంటికొచ్చిన కొత్త అల్లుడిని ముందుగా గాడిద పై కూర్చోబెట్టి గ్రామంలో తిప్పి హోలీ ఆడిస్తారు. ఇక్కడి ప్రజలు ఈ సంప్రదాయాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున గ్రామంలోని కొత్త అల్లుళ్ళు గ్రామానికి వచ్చి హోలీ జరుపుకోవాలని ప్రత్యేక ఆహ్వానం కూడా పంపిస్తారు.
ఈ సంప్రదాయం ఎందుకు జరుపుకుంటారు ?
స్థానిక ప్రజల కథనం ప్రకారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని విదా యెవ్తా గ్రామంలో సుమారు 86 ఏళ్ల క్రితం దేశ్‌ముఖ్ కుటుంబం నివసించేది. దేశ్‌ముఖ్ కుటుంబంలో ఒక కుమార్తె ఉండేది. పెళ్లి తర్వాత మొదటి హోలీ రోజున కూతురు, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు రంగులు వేసుకుని హోలీ ఆడేందుకు నిరాకరించాడు. అయితే అల్లుడిని మామ ఎలాగో అలా ఒప్పించారు. చాలా ప్రయత్నాల తర్వాత అల్లుడు ఒప్పుకోవడంతో మామగారు పూలతో అలంకరించిన గాడిదను తీసుకువచ్చి దాని మీద అల్లుడిని కూర్చోబెట్టి ఊరు చుట్టి మరీ హోలీ ఆడారట.
ఈ ఆచారం ఎక్కడ మొదలైంది ?
స్థానికుల కథనం ప్రకారం ఆనందరావు దేశ్‌ముఖ్ అనే ఆయన ఈ విచిత్ర సంప్రదాయాన్ని ప్రారంభించాడని చెబుతారు. ఆ ఊరి ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారట. నవ వరుడికి గాడిద ఎక్కే సంప్రదాయం ఆనందరావు అల్లుడు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కొనసాగుతోందని చెబుతున్నారు. ఈ సవారీ గ్రామం మధ్య నుంచి ప్రారంభమై 11 గంటలకు హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఈ సంప్రదాయంలో అల్లుడికి నచ్చిన బట్టలను ఇస్తారు.