- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఫ్రికన్ ప్రజలను చంపుతున్న సముద్ర తాబేలు.. కారణం అదేనా..
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని చాలామంది సీ ఫుడ్స్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. చేపలు, పీతలు, రొయ్యలు, తాబేలు ఇలా చాలా రకాల సీ ఫుడ్స్ ని తింటూ ఉంటారు. అలాగే ఇటీవలి కాలంలో ఆఫ్రికాలోని జాంజిబార్‌లో తాబేలు మాంసం తిని 9 మంది మృత్యువాత పడ్డారు. అయితే వారిలో 8 మంది పిల్లలు ఉండగా ఒకరు పెద్దవారు ఉన్నారు. వారితో పాటు మరో 78 మంది కూడా ఆసుపత్రి పాలయ్యారు. పెరుగుతున్న మరణాలు, రోగుల సంఖ్య సముద్ర తాబేలు మాంసం తినడం సురక్షితమేనా అనే ప్రశ్నలను మరోసారి లేవనెత్తింది. అయితే తాబేలు మాంసంలో ఉన్న కిలోనిటాక్సిసిజం వారి మరణాలకు కారణం అని వైద్యనిపుణులు చెప్పారు. ఇంతకీ వారి మరణాలకు కారణం అవుతున్న కిలోనిటాక్సిజం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిలోనిటాక్సిజం అంటే ఏమిటి ?
కిలోనిటాక్సిసిజం అనేది తాబేళ్ల నుండి విడుదలయ్యే విష పదార్థం. దీని వల్ల మానవులకు హాని కలుగుతుంది. సముద్ర తాబేళ్లు వాటి సుదీర్ఘ జీవితానికి ప్రసిద్ధి చెందాయి. అయితే వాటి పైభాగంలోని గట్టి షెల్ లోపల ఒక రకమైన విషపూరిత పదార్థం ఉంటుంది. దీనిని కిలోనిటాక్సిన్ అంటారు. తాబేళ్లలో మాత్రమే కాకుండా ఇది అనేక ఇతర జల జంతువులలో కూడా కనిపిస్తుంది.
తాబేళ్లు తమను తాము రక్షించుకోవడానికి ఈ విషాన్ని ఉపయోగిస్తాయి. ఏదైనా నీటి జంతువు లేదా ఏదైనా బెదిరింపులకు గురైనప్పుడు అవి ఆ విషాన్ని విడుదల చేస్తాయి. ఇది వాటిని వేటాడే జంతువుల నుండి రక్షిస్తుంది. ఈ విషం మనుషులకు ముప్పుగా మారింది.
తాబేలు విషం మనుషులకు ఎలా చేరుతుంది ?
దీని విషం కొన్ని పరిస్థితులలో మనుషులకు చేరుతుంది. ఉదాహరణకు తాబేలు మాంసం తినాలనుకున్నప్పుడు వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాబేలు గుడ్లు లేదా శరీర ద్రవాలతో కలిసినప్పుడు కూడా ప్రమాదం పెరుగుతుంది. దీని మాంసం సరిగా ఉడకకపోవడం లేదా తినే సమయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల మనుషులకు దీని విషం ఎక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. జాంజిబార్‌తో సహా అనేక ద్వీపాలలో తాబేళ్లను తింటారు.
తాబేలు విషం శరీరంలోకి చేరినట్లయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి. తీవ్రమైన సందర్భాల్లో శరీర భాగాలు పనిచేయడం ఆగిపోవచ్చు. అలాగే మరణం కూడా సంభవించవచ్చు. అక్కడ కూడా ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. దీని కారణంగా నవంబర్ 2021లో కూడా ప్రజలు చనిపోయారు. కాగా ముగ్గురు ఆసుపత్రిలో చేరారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇటువంటి కేసులను నివారించడానికి ఇప్పటికే సరైన సలహాలు జారీ వెలుగులోకి వచ్చాయి. అలాగే సముద్ర తాబేళ్లను కొనడం, అమ్మడం, తినడం పై నిషేధం ఉంది. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా సహా అనేక దేశాల్లో తాబేళ్లను పట్టుకోవడం, వేటాడడం పై నిషేధం ఉంది.
Read More..
ఇంట్లో ఈ మొక్కలు అసలు నాటకూడదు.. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే..