- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీర్ణాశయాంతర క్యాన్సర్‌కు దారితీస్తున్న అధిక బరువు..
దిశ, ఫీచర్స్: అధిక బరువు లేదా ఒబేసిటీ గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని మనకు తెలిసిందే. కానీ అవి జీర్ణాశయాంతర క్యాన్సర్లకు(gastrointestinal cancers) కూడా కారణం అవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. క్యాన్సర్, ఊబకాయం మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందో తెలుసుకోవడానికి ఒహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్‌నర్(Wexner )మెడికల్ సెంటర్ నిపుణులు పరిశోధనలు చేశారు. దాదాపు 20% క్యాన్సర్లు అధికబరువుతో ముడిపడి ఉన్నాయని వారు పేర్కొన్నారు.
మునుపటి అధ్యయనాల ప్రకారం కూడా ఫ్యాట్ సెల్స్ శరీరంలోని భాగాలకు వ్యాపిస్తూ కణాల వాపునకు, కణ విభజన దారి తప్పడానికి కారణం అవడం మూలంగా కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. ప్రస్తుత అధ్యయనం కూడా అదే పేర్కొన్నది. జీవితంలోని వివిధ దశలలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI) మధ్య అనుబంధాన్ని, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్‌ను డెవలప్ చేసే రిస్కును నిపుణులు పరిశీలించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. యూఎస్ జనాభాలో 70% మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఒబేసిటీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంభవించే ప్రమాదాల మధ్య అనుబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం’’ అని ప్రధాన పరిశోధకుడు హోలీ అన్నారు.
అధ్యయనం గురించి చర్చించడానికి ముందు కొంతమంది ఒక వ్యక్తి యొక్క ఎత్తు, బరువు ఆధారంగా బాడీ ఫ్యాట్‌ను గణించే BMI విధానం పాతదని, దాని కొలతలను ప్రామాణికంగా పరిగణించలేమని కొందరు పరిశోధకులు వాదించారు. ఎందుకంటే ఇది కండర ద్రవ్యరాశి(consider muscle mass), బోన్ డిస్నిటీ విషయాల్లో మొత్తం శరీరాన్ని కొలవలేదు. రేషియల్ సెక్స్ డిఫరెన్స్‌ను గుర్తించదు. నడుము నుంచి హిప్ నిష్పత్తి బరువుకు సంబంధించి ఆరోగ్యాన్ని కొలవడానికి మరింత కచ్చితమైన మెట్రిక్ అవసరం కావచ్చు అని విమర్శకులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆరోగ్య ప్రమాదాలను త్వరగా, సులభంగా గుర్తించడానికి ప్రస్తుతం BMI మాత్రమే ఒక ప్రామాణిక సాధనంగా మిగిలిపోయింది.
పరిశోధకులు ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ అండ్ అండాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం నమోదు చేసుకున్న 1,31,161 మంది రోగుల నుంచి డేటాను సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. తక్కువ బరువు (BMI 18.5 కంటే తక్కువ), సాధారణ బరువు (BMI 18.5 నుంచి 24.9), అధిక బరువు (BMI 25 నుంచి 29.9), ఊబకాయం (BMI 30 పైన) ఉన్నవారిని స్టడీ చేశారు. అయితే ఇందులో అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలోనే జీర్ణాశయ క్యాన్సర్ ఉన్నట్లు గమనించారు. మరో విషయం ఏంటంటే.. 12 నెలలపాటు ఆస్పిరిన్ లేదా ఆస్పిరిన్ పూతతో కూడిన మందులను తీసుకున్నవారిలో ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.
Also Read...
స్లీప్ అప్నియా దీర్ఘకాలిక కోవిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది.. అధ్యయనంలో వెల్లడి