నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఓ అధికారి సంత‌కం! మైండ్ బ్లాక్ అంతే..!!

by Sumithra |
నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఓ అధికారి సంత‌కం! మైండ్ బ్లాక్ అంతే..!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌పంచంలో ఒక‌టిని పోలిన‌వి మ‌రొక‌టి ఉండొచ్చు. కానీ, ఏ ఒక్క‌రి బొట‌ని వేలి ముద్ర ఒకేలా ఉండ‌వ‌ని అంద‌రికీ తెలిసిందే. అలాంటి గుర్తింపే సంత‌కానికి కూడా ఉంటుంది. కానీ, సంత‌కాన్ని పోర్జ‌రీ చేయ‌డం చాలా ఈజీ ప‌ని అని ఇప్ప‌టికే చాలా మందికి తెలుసు. అయితే, కొన్ని సంత‌కాల‌ను మాత్రం క్లోన్ ప్రింట్‌ తీయాల్సిందే త‌ప్ప చేతితో అయితే చేయ‌నే లేము. అలాంటి ఓ అత్యంత అరుదైన సంత‌కం గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని ఓ అధికారి సంతకం. ఇంత స్పెష‌ల్ కాబ‌ట్టే ఆ సంత‌కం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ రిజిస్ట్రార్ సీల్ పైన ఈ సంతకం కనిపిస్తుంది. ఇది మార్చి 4, 2022 నాటిది.

ఈ సంత‌కాన్ని చూసిన నెటిజ‌న్లు స‌ర‌దా మీమ్‌ల‌తో సంద‌డి చేస్తున్నారు. అధికారి తన పెన్ పని చేస్తుందా లేదా అని పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది! అని ఒక‌ళ్లు అంటే, "ఇది పందికొక్కులా ఉంది!" ఉంద‌ని మ‌రొక‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక‌, ఈ పోస్ట్‌కు మ‌రిని ఆస‌క్తిక‌ర సిగ్నేచ‌ర్ల‌ను జ‌త చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed