- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఖీ సెలబ్రేషన్స్.. డేటింగ్ యాప్‌లో సిస్టర్ కోసం అన్వేషణ
దిశ, ఫీచర్స్ : డేటింగ్, కంపేనియన్షిప్ కోసం పార్ట్నర్స్ మ్యాచింగ్కు రూపొందించబడిన టిండర్ యాప్‌ను కొంతమంది యూజర్లు ఉన్నతమైన కారణాల కోసం ఉపయోగిస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన వ్యక్తి తనకొక సిస్టర్ను వెతుక్కునేందుకు ఈ యాప్ ఉపయోగించినట్లు రెడిట్‌లో పోస్ట్ చేశాడు. అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి రక్షాబంధన్‌ను మిస్ అవుతున్న సదరు వ్యక్తి.. ఈ సారి ఎలాగైనా రాఖీ కట్టించుకునేందుకు టిండర్ సాయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఆలోచన కాస్త వింతగా ఉన్నప్పటికీ వర్కవుట్ కావడంతో ఈ యాప్ వేదికగా అతనికి ఇద్దరు సోదరీమణులు లభించారు.
'నాకు సోదరి లేనందున ప్రతి రక్షాబంధన్‌కు ఒంటరితనాన్ని అనుభవించాను. అందుకే గత రెండేళ్లుగా రాఖీ పండుగకు 2 వారాల ముందు నా బయోను 'రక్షాబంధన్ సందర్భంగా హ్యాంగ్అవుట్ చేయడానికి సోదరి కోసం వెతుకుతున్నాను' అని మారుస్తున్నాను. మొత్తానికి టిండర్‌కు ధన్యవాదాలు. ఈసారి నా ప్రయత్నం ఫలించింది. టిండర్ యాప్‌లో ఇద్దరు సోదరీమణులను కలుసుకున్నాను. ఈ ఏడాది మేము ముగ్గురం కలిసి రక్షాబంధన్ జరుపుకొని, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
ఈ పోస్ట్.. కూతురి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న ఓ తండ్రి 'నా కుమార్తెకు అబ్బాయి కోసం వెతుకుతున్నాను అనే బదులు 'నా కుమార్తె కోసం వెతుకుతున్నాను' అని రాసిన అమ్మాయి ప్రొఫైల్‌ను గుర్తు చేసిందని ఒక రెడిట్ యూజర్ వ్యాఖ్యానించారు. 'అయ్యో.. నేను నీకు రాఖీ కడతాను. ఎందుకంటే నా సోదరుడు దేశంలో లేడు. ఈ రక్షాబంధన్ సమయంలో నేను కూడా ఒంటరిగా ఉన్నాను.. రెడిట్ సోదరి' అంటూ మరొక యూజర్ పేర్కొంది.