రాత్రికి రాత్రే మారిపోయిన భాష.. అదే స్పీడ్‌లో ఊడిపోయిన ఉద్యోగం

by Sumithra |
రాత్రికి రాత్రే మారిపోయిన భాష.. అదే స్పీడ్‌లో ఊడిపోయిన ఉద్యోగం
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా భాష నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిన్నప్పటి నుండి హిందీ మాట్లాడుతుంటే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు. మరికొంత మంది కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ వేరే భాష నేర్చుకోలేరు. అయితే ఓ మహిళ మాత్రం కేవలం రాత్రికి రాత్రే తాను మాట్లాడే భాషను మార్చేసిందట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. పడుకునే ముందు ఒక భాష మాట్లాడిన మహిళ ఉదయం లేచి మరో భాషను అవలీలగా ఎలా మాట్లాడుతుందట. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ మహిళ పేరు జో కోల్స్. ఒక రాత్రి తనకు ఒక విచిత్రమైన సంఘటన జరిగిందని ఆమె వెల్లడించింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం తాను ఇంగ్లండ్‌లోని లింకన్‌షైర్ నివాసి. ఆమె మాట్లాడే భాష ఇంగ్లీషులోనే ఉందట. అయితే ఆమె ఒక రాత్రి నిద్రపోయి మరుసటి రోజు ఉదయం లేచినప్పుడు ఆమె భాష మారిపోయిందని జో చెప్పారట. ఆమె ఇంగ్లీషులో కాకుండా వెల్ష్ ప్రజలలా మాట్లాడటం ప్రారంభించిందని చెప్పారట. ఆమె భాషను విని ఇది ఎలా జరిగిందో నమ్మలేకపోయిందట. రాత్రికి రాత్రే తన ఉచ్చారణ అకస్మాత్తుగా ఎలా మారిందో ఆమెకు అర్థం కాలేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె మాట్లాడే భాషకు సంబంధించిన ప్రదేశాన్ని ఆమె ఎప్పుడూ సందర్శించలేదని వెల్లడించారు.

ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్‌ ?

2022 సంవత్సరంలో వైద్యులు ఆమె ఫంక్షనల్ న్యూరోలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని, అయితే ఇప్పుడు ఆమె యాసలో మార్పు వచ్చిందని జో చెప్పారు. ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ అనే వ్యాధితో కూడా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను పని చేసేదానినని, అయితే మారుతున్న యాస కారణంగా ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేయాల్సి వచ్చిందని జో చెప్పింది.

ఇంటి పని కూడా చేయలేని పరిస్థితి..

తనకు తలనొప్పి, కాళ్లలో వణుకు వంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయట. ఈ కారణంగా ఆమె ఇక పై ఊడ్చడం, తుడుచుకోవడం వంటి సాధారణ ఇంటి పనిని కూడా చేయలేరని చెబుతున్నారు. అయితే ఇంతకుముందు ఆమె ఇంటి పని మొత్తాన్ని సులభంగా చేసేది. ఆమె వేల్స్ నుండి వచ్చిందా అని ప్రజలు అడగడం ప్రారంభించినప్పుడు తనకు చాలా వింతగా అనిపిస్తుందని జో చెప్పింది. ఆమె మళ్లీ తన మునుపటి యాసలో మాట్లాడాలని కోరుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed