జూ - కీపర్‌ పై అటాక్ చేసిన మొసలి.. దాని వీపు పై కూర్చున్న సందర్శకుడు.. వీడియో..

by Sumithra |
జూ - కీపర్‌ పై అటాక్ చేసిన మొసలి.. దాని వీపు పై కూర్చున్న సందర్శకుడు.. వీడియో..
X

దిశ, ఫీచర్స్ : కుక్కలు, గుర్రాలు, ఆవులు వంటి కొన్ని జంతువులతో స్నేహం చేయగలం. వాటిని జాగ్రత్తగా పెంచగలం. అంతే కాదు వాటితో ప్రేమగా వ్యవహరిస్తే అవి యజమాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే కొన్ని జంతువులను పెంచినా వాటితో స్నేహం చేసినా చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైన జంతువులలో సింహం, పులి, మొసలి ముఖ్యమైనవి. వాటికి కావలసిందల్లా ఒక అవకాశం మాత్రమే. అవి ఏ సమయంలో, ఎవరి పైన దాడి చేస్తాయో కూడా తెలియదు. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మొసలి తన సంరక్షకురాలి పై దాడి చేస్తుంది. కానీ సందర్శించడానికి వచ్చిన వ్యక్తి ఆమె ప్రాణాలను కాపాడుతాడు. ఈ సంఘటన గురించిన పూర్తివివరాలను ఇప్పుడు చూద్దాం.

కొంతమంది చిన్న పిల్లలు జూను సందర్శించడానికి వచ్చారు. నీటిలో పడి ఉన్న మొసలిని వారు చూస్తుండగా అది ఒక్కసారిగా జూకీపర్‌ పై దాడి చేసి ఆమె చేతిని బలంగా పట్టుకుంది. దీంతో తనను తాను విడిపించుకోవడం కష్టంగా మారింది. అతి కష్టం మీద ఓ వ్యక్తి సాయంతో ప్రాణాలు కాపాడుకుంది.

జూ - కీపర్‌ను రక్షించడానికి వచ్చిన వ్యక్తి మొసలి వీపు పై ఎలా కూర్చున్నాడో మీరు వీడియోలో చూడవచ్చు. చాలా సేపటి తర్వాత పట్టు సడలడంతో జూ కీపర్ ను బయటికి తీశారు. కానీ జూ కీపన్ ని రక్షించేందుకు వచ్చిన ఆ వ్యక్తి మొసలి వీపు పై కూర్చొని ఉండిపోయాడు. దీంతో మొసలి ఆ వ్యక్తిని తన వీపు నుండి క్రిందికి దింపడానికి తీవ్రంగా ప్రయత్నించింది. తర్వాత అవకాశం రాగానే తను కూడా అక్కడి నుంచి లేచి బయటకి పరుగెత్తాడు. మొసలి దాడికి సంబంధించిన ఈ వీడియో @PicturesFoIder అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed