- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెడ్ చిల్లీ పౌడర్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
దిశ, ఫీచర్స్: సుగంధ ద్రవ్యాలకు భారతదేశం పెట్టింది పేరు. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి ఇక్కడ వాటిని ఎక్కువగా పండిస్తారు. అలాంటి మసాలాలో ఎర్ర మిరప పొడి ఒకటి. దీనిని లాల్ మిర్చి అని కూడా పిలుస్తారు. ఎర్ర మిరపకాయ ప్రతి భారతీయ ఇంటిలో సాధారణం. వాటిని మొదట ఎండబెట్టి, ఆపై పొడిగా, మొత్తగా చేస్తారు. అయితే మనకు తెలిసినంత వరకూ ఎర్ర కారం ఎక్కువగా తినడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అంటుంటారు. కారం ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు సంభవిస్తాయి. ఇది కడుపుకు అస్సలు మంచిది కాదు. పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఇలా చాలానే వింటూ వచ్చాం. అయితే ఈ రెడ్ చిల్లీ పౌడర్‌లో చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
రక్తపోటును నివారిస్తుంది..
రెడ్ చిల్లీలో అధిక పొటాషియం ఉండటంతో రక్త నాళాలను సడలించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో రక్తపోటు బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే శరీరంలో వాపు, నొప్పిని తగ్గించే గుణం ఎర్ర మిరపకాయకు ఉంది. జలుబు చేసినప్పుడు కాస్తంత ఘాటుగా కారంతో తింటే ముక్కు కారడాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది..
ఎర్ర మిరపకాయలో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే ఇది నేరుగా కేలరీలను బర్న్ చేస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. కారం ఎక్కువ తక్కువ అని కాకుండా మనం ఎంచుకున్న కూరగాయలను బట్టి వాడాలి. అలాగే మాంసంలో అయితే మాత్రం అధికంగా వాడటం మంచిది. ఎందుకంటే మాసంలో ఉండే కొవ్వు పదార్థం మన బాడీలో ఫామ్ కాకుండా ఈ రెడ్ చిల్లి కాపాడుతుంది.
ధమనులను అన్‌బ్లాక్ చేస్తుంది..
గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి ధమనులు మూసుకుపోవడం. ధమనులు మూసుకు పోయినప్పుడు గుండెకు సాధారణంగా జరిగే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇలా జరగడానికి కారణం ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం. ఆహారపు అలవాట్లు. అయితే ఈ ధమనులు, రక్త నాళాలు ముడుచుకోకుండా ఉండాలంటే తీసుకునే ఫుడ్‌లో చిల్లీ పౌడర్ బాగా పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
జుట్టు-చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..
ఎర్ర మిరపకాయలోని ముఖ్యమైన భాగాలు విటమిన్ 'సి' విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టు, చర్మాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. మనం తినే ఫుడ్‌పైనే మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. కారం అధికంగా తినడం వల్ల బలంగా ఉంటాం. చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.
జీర్ణక్రియలో సహాయపడుతుంది..
ఎర్ర మిరపకాయ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం కారణంగా వచ్చే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.