Bheemla Nayak: ఆసక్తి రేకెత్తిస్తోన్న టైటిల్ సాంగ్ సింగర్ హిస్టరీ

by Anukaran |   ( Updated:2021-09-02 08:40:12.0  )
Beemlanayak
X

దిశ,వెబ్‌డెస్క్ : పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వీడియోలో కనిపించే జానపద గాయకుడిని గుర్తుపట్టారా? ఆయన ఎవరో కాదు. ‘12 మెట్ల కిన్నెర ’ అనే అరుదైన వాయిద్య కళాకారుడు మొగులయ్య. ఈయనది నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవసలికుంట గ్రామం. అయితే కనుమరుగవుతున్న వాయిద్యాన్ని కాపాడుతున్న మొగులయ్యని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సత్కరించింది. అంతేకాకుండా ఈయనకున్న ప్రతిభను తెలిసేలా ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా కూడా ప్రభుత్వం చేర్చింది.

Mogulaiah

అయితే ఇంత గొప్ప వ్యక్తి నాలుగు నెలల క్రితం వరకు రోడ్లపై తిరుగుతూ వాయిద్యం వాయిస్తూ యాచకుడిగా మారారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో పొట్టకూటి కోసం ఇలాంటి పనిచేయాల్సి వచ్చిందని, ఆయన స్థితిగతులను ప్రభుత్వానికి తెలియజేసేలా నాలుగు నెలల క్రితం ఓ ప్రముఖ పత్రిక ప్రచురించింది. దీంతో ప్రభుత్వం కొంత సాయం అందించినట్లు అప్పట్లో ప్రకటించింది. దీని గురించి తెలుసుకున్న బీమ్లా నాయక్ చిత్ర యూనిట్ మూవీకి టైటిల్ సాంగ్ పాడేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. గురువారం విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం అందరినీ మెప్పిస్తోంది.

Singar Mogulaiah

Advertisement

Next Story

Most Viewed