సీఎం నారాయణ స్వామి ప్రభుత్వానికి తమిళిసై డెడ్‌లైన్..

by Shamantha N |
సీఎం నారాయణ స్వామి ప్రభుత్వానికి తమిళిసై డెడ్‌లైన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్న తమిళి సై సౌందర్ రాజన్‌ను కేంద్ర హోంశాఖ పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌‌గా అదనపు హోదాలో నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం పుదుచ్చేరి అదనపు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనార్టీలో ఉందని ప్రతిపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదుచేశాయి. దీనిపై స్పందించిన తమిళి సై ఫ్లోర్ టెస్టుకు సిద్ధం కావాలని సీఎం నారాయణ స్వామి ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 5గంటలలోపు మెజార్టీని నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రస్తుతం 28 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 14 మంది, ప్రతిపక్ష బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 15 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. బలపరీక్షలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడినట్లయితే నారాయణ స్వామి ముఖ్యమంత్రి పదవిని కోల్పోనున్నారు. ఇదిలాఉండగా, వచ్చే మేలో పుదుచ్చేరి అసెంబ్లీ కాలపరిమితి కూడా పూర్తవనున్నది.

Advertisement

Next Story