ఇసాయిపేట్‌లో చిరుత సంచారం

by Shyam |
ఇసాయిపేట్‌లో చిరుత సంచారం
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ శివారు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.వివరాల్లోకివెళితే..అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై ఆదివారం సాయంత్రం చిరుత పులి దాడి చేసింది.ఈ దాడిలో ఓ మేక దానికి ఆహారం కాగా, మరో మేక గాయపడి మృతి చెందింది. మరికొన్ని మేకలు బెదిరిపోగా, మరికొన్ని గాయాలపాలయ్యాయి. భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, సోమవారం అధికారులు అటవీ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం మేకల యజమాని గొల్ల పరుశయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆహారం కోసం చిరుత మళ్లీ గ్రామంలోకి వచ్చే అవకాశం ఉన్నందున్న అటవీ సరిహద్దులో ప్రత్యేక బోన్ ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed