- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడ కలెక్టరేట్ ఎదట… వామపక్షాల ఆందోళన
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లమీదరకు వచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధులు పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కలెక్టరేట్‌కు చేరుకొని, నిరసన కారులను, రైతులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story